బుధవారం 05 ఆగస్టు 2020
National - Aug 01, 2020 , 08:01:27

దీపంకర్‌ ఘోష్‌కు ప్రేమ్‌బాటియా జర్నలిజం అవార్డు

దీపంకర్‌ ఘోష్‌కు ప్రేమ్‌బాటియా జర్నలిజం అవార్డు

న్యూఢిల్లీ: ఇంగ్లిష్‌ దినపత్రిక ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన జర్నలిస్టు దీపంకర్‌ ఘోష్‌కు 2020కు గాను ‘ప్రేమ్‌ బాటియా జర్నలిజం అవార్డు’ లభించింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో వలస కార్మికుల అవస్థలపై ఆయన వెలువరించిన కథనాలు ఆలోచింపజేసేవిగా ఉన్నాయని జ్యూరీ అభిప్రాయపడింది. పురస్కారంలో భాగంగా ఆయనకు రూ.2 లక్షల నగదు బహుమతిని ఇవ్వనున్నారు. 


మరోవైపు పీపుల్స్‌ ఆర్కైవ్‌ ఆఫ్‌ రూరల్‌ ఇండియా (పరీ) వెబ్‌సైట్‌కు కూడా బాటియా అవార్డు లభించింది. గ్రామీణ ప్రాంతాల మీద కరోనా ప్రభావంపై కథనాలను ప్రచురించినందుకుగాను ఈ పురస్కారం ప్రకటించినట్టు ప్రేమ్‌ బాటియా ట్రస్టు వెల్లడించింది. అవార్డులో భాగంగా పరీ వెబ్‌సైటు ప్రతినిధులకు రూ. 1.5 లక్షలు ఇవ్వనున్నట్టు తెలిపింది.logo