బుధవారం 08 ఏప్రిల్ 2020
National - Mar 19, 2020 , 19:45:26

‘కరోనా’పై నో ఫికర్‌ అంటోన్న ప్రీతిజింటా..వీడియో

‘కరోనా’పై నో ఫికర్‌ అంటోన్న ప్రీతిజింటా..వీడియో

కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) వ్యాప్తి చెందకుండా ఇప్పటికే విదేశాల నుంచి వచ్చినవారు హోం క్వారంటైన్‌కు పరిమితమైన విషయం తెలిసిందే. అయితే కరోనాతో భయపడకుండా...ఇంట్లోనే జాగ్రత్తలు తీసుకునేందుకు ఓ చిట్కా చెప్తూ వీడియోను పోస్ట్‌ చేసింది బాలీవుడ్‌ నటి ప్రీతి జింటా. లాస్‌ఏంజెల్స్‌లోని ఇంట్లో సెల్ప్‌ క్వారంటైన్‌లో ఉన్న ప్రీతి జింటా తన తల్లి తలకు నూనె పెడుతూ మసాజ్‌ చేస్తోంది. ఇలా చేస్తే మీ వెంట్రుకలు బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయొచ్చు. 

హోం క్వారంటైన్‌ సమయంలో ఇలా చేస్తే మన తల హాయిగా ఉంటుంది. ఇంట్లో ఉన్నవారితో బంధం కూడా మరింత పెరుగుతుంది క్యాప్షన్‌ ఇచ్చింది ప్రీతి. ప్రీతిజింటా ఇంట్లోనే ఉంటూ బోరుగా ఫీలవకుండా ఎలా గడపాలో చెప్పిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. 


logo