ఆదివారం 12 జూలై 2020
National - Jun 22, 2020 , 13:53:48

తీహార్ జైలులో 39 ప్ర‌స‌వాలు.. గ‌ర్భిణి స‌ఫూరాకు బెయిల్ ఇవ్వం

తీహార్ జైలులో 39 ప్ర‌స‌వాలు..  గ‌ర్భిణి స‌ఫూరాకు బెయిల్ ఇవ్వం

హైద‌రాబాద్‌: ఢిల్లీలో ఇటీవ‌ల జ‌రిగిన అల్ల‌ర్ల కేసులో జామీడియా క‌మిటీ స‌భ్యురాలు స‌ఫూరా జ‌ర్గార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. జామియా మిలియా ఇస్లామియా వ‌ర్సిటీలో ఎంఫిల్ చ‌దువుతున్న ఆమెను ప్ర‌స్తుతం తీహార్ జైలులో ఉంచారు. గ‌ర్భ‌వ‌తి అయిన ఆమె.. బెయిల్ ఇవ్వాలంటూ జైలుకు అభ్య‌ర్థ‌న పెట్టుకున్న‌ది. అయితే ప్రెగ్నెన్సీ ఆధారంగా బెయిల్ ఇవ్వ‌డం కుద‌ర‌ద‌ని ఢిల్లీ పోలీసులు తేల్చి చెప్పారు.  గ‌త ప‌దేళ్ల‌లో తీహార్ జైలులో 39 మంది గ‌ర్భిణుల‌కు ప్ర‌స‌వం జ‌రిగింద‌ని తెలిపారు.  ఢిల్లీ హైకోర్టుకు తీహార్ జైలు అధికారులు ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. 

స‌ఫూరా జ‌ర్గార్ గ‌ర్భిణ అయినంత మాత్రాన ఆమె చేసిన నేరం త‌క్కువేమీ కాదు అని ఢిల్లీ పోలీసులు కోర్టుకు చెప్పారు. జైలులోనే ఆమెకు అన్ని వైద్య స‌దుపాయాలు క‌ల్పిస్తున్న‌ట్లు జైల‌ర్ తెలిపారు. సుప్రీంకోర్టు సూచ‌న‌ల మేర‌కు గ‌ర్భిణుల‌కు అన్ని జాగ్ర‌త్త‌లు పాటిస్తున్న‌ట్లు జైల‌ర్ తెలియ‌జేశారు.  స‌ఫూరా జ‌ర్గార్‌కు ప్ర‌త్యేక చికిత్స ఇవ్వ‌డం కుద‌ర‌ద‌న్నారు.  స్పెష‌ల్ సెల్ డీసీపీ పీఎస్ కుశ్వాహ్ ఈ రిపోర్ట్‌ను త‌యారు చేశారు.  

జ‌ర్గార్‌ను ప్ర‌త్యేక సెల్‌లో వేశామ‌ని, రెగ్యూల‌ర్‌గా డాక్ట‌ర్లు ఆమెను ప‌రీక్షిస్తున్నార‌ని, అవ‌స‌ర‌మైన మందులు, మంచి ఆహారాన్ని అందిస్తున్న‌ట్లు పోలీసులు తెలిపారు. 


logo