ఆదివారం 05 జూలై 2020
National - Jun 23, 2020 , 17:12:48

సఫూరా జర్గర్‌కు బెయిల్‌ ఇచ్చిన ఢిల్లీ హైకోర్టు కోర్టు

సఫూరా జర్గర్‌కు బెయిల్‌ ఇచ్చిన ఢిల్లీ హైకోర్టు కోర్టు

న్యూఢిల్లీ : ఢిల్లీ అల్లర్ల కేసులో జామియా యూనివర్సిటీ విద్యార్థి, జామియా కోఆర్డినేషన్‌ కమిటీ సభ్యురాలు సఫూర జర్గర్‌కు మంగళవారం ఢిల్లీ హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. సీఏఏకు వ్యతిరేకంగా ఫిబ్రవరిలో జరిగిన అల్లర్ల కేసులో ఉగ్రవాద నిరోధక చట్టం కింద ఏప్రిల్‌ 10న  పోలీసులును ఆమెను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె ఐదునెలల గర్భణి కావడంతో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా, వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కేసును న్యాయమూర్తి విచారణ జరిపారు.

పోలీసుల తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా బెయిల్‌ను వ్యతిరేకించకపోవడంతో బెయిల్‌ మంజూరు చేశారు. విచారణకు ఆటంకం కలిగించే కార్యకలాపాల్లో పాల్గొనద్దని ఢిల్లీ హైకోర్టు సఫూరా జర్గర్‌ను ఆదేశించింది. పోలీసుల అనుమతి లేనిది ఇతర ఢిల్లీ దాటి వెళ్లొదని, వెళ్లాల్సి వస్తే అనుమతి తీసుకోవాలని, అలాగే 15రోజులకోసారి విచారణ అధికారిని ఫోన్‌లోనైనా సంప్రదించాలని సూచించింది. జేఎంఎంలో ఎంఫిల్ విద్యార్థి అయిన సంఫూరా జామియా కోఆర్డినేషన్ కమిటీ సభ్యురాలు. ఈశాన్య ఢిల్లీలో పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టానికి వ్యతిరేకంగా జరిగిన అల్లర్ల కేసులో ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. 


logo