గురువారం 28 జనవరి 2021
National - Jan 08, 2021 , 12:06:44

ప్రెగ్నెన్సీ కోసం ల‌‌ఢాక్‌కు యురోపియ‌న్ అమ్మాయిలు.. ఎందుకు?

ప్రెగ్నెన్సీ కోసం ల‌‌ఢాక్‌కు యురోపియ‌న్ అమ్మాయిలు.. ఎందుకు?

అవును.. మీరు చ‌ద‌వింది నిజ‌మే. కేవ‌లం ప్రెగ్నెన్సీ కోస‌మే యురోపియ‌న్ దేశాల నుంచి అమ్మాయిలు ల‌ఢాక్ వ‌స్తున్నారు. అక్క‌డి అబ్బాయిల‌తోనే పిల్ల‌ల‌ను క‌నాలన్న ఉద్దేశంతో వీళ్లు ప్ర‌త్యేకంగా ఇక్క‌డికి క్యూ క‌డుతుండ‌టం విశేషం. జ‌ర్మ‌నీ, ఫ్రాన్స్‌, స్పెయిన్‌లాంటి దేశాల నుంచి ప్ర‌తి ఏటా ల‌ఢాక్‌కు వ‌స్తున్న వాళ్ల సంఖ్య పెరిగిపోతోంది. ఇదంతా చ‌దువుతుంటే అస‌లు యురోపియ‌న్ అమ్మాయిలు ఏంటి? ఎక్క‌డో ల‌ఢాక్‌లోని అబ్బాయిల‌తో క‌లిసి పిల్ల‌ల‌ను క‌నాల‌ని అనుకోవ‌డం ఏంటి అన్న అనుమానం క‌లుగుతోందా? ఆ స్టోరీ ఏంటో చూసేయండి.

ఆర్య‌న్ సంతానం కావాలని..

వీళ్లంతా ఇక్క‌డికి వ‌స్తోంది ఆర్య‌న్ సంతానం కోస‌మే. ఆర్య‌న్లు అంటేనే ఆరు అడుగుల ఆజానుబాహులు.. నీలి క‌ళ్లు క‌లిగిన అంద‌మైన అబ్బాయిలు. వీళ్లు ల‌ఢాక్‌లోని మారుమూల గ్రామాల్లో ఉన్నార‌ని, వీళ్ల‌తో శృంగారం చేసి వాళ్లలాంటి అంద‌మైన ఆర్య‌న్ సంతానాన్ని పొందాల‌ని యురోపియ‌న్ అమ్మాయిలు ఉవ్విళ్లూరుతున్నార‌ట‌. అందుకే పెద్ద సంఖ్య‌లో అమ్మాయిలు ల‌ఢాక్‌కు క్యూ క‌డుతున్న‌ట్లు ఎప్ప‌టి నుంచో వార్త‌లు వ‌స్తున్నాయి. దీనికి ప్రెగ్నెన్సీ టూరిజం అనే పేరు కూడా పెట్టారు. 

ఎక్క‌డి వాళ్లు ఈ ఆర్య‌న్లు..

ఎప్పుడో క్రీస్తుపూర్వం గ్రీకువీరుడు అలెగ్జాండ‌ర్ ఒక్కో రాజ్యాన్ని వ‌రుస‌గా జ‌యిస్తూ ఇండియాపైకి వ‌చ్చిన సంగ‌తి తెలుసు క‌దా. సింధూ లోయ వ‌ర‌కూ వ‌చ్చిన అలెగ్జాండ‌ర్‌.. ఆ త‌ర్వాత ఇండియాలోకి రాకుండానే తిరిగి వెళ్లిపోయాడు. కానీ అత‌ని వెంట వ‌చ్చిన సైన్యంలో కొంత మంది ఇక్క‌డే ఉండిపోయారు. అప్ప‌టి నుంచీ సింధూ లోయ‌లోనే వాళ్లు ఉంటున్నారు. వీళ్ల‌నే ఇప్పుడు చివ‌రి ఆర్య‌న్లుగా భావిస్తున్నారు. ల‌ఢాక్‌లోని ఐదు గ్రామాల్లో చివ‌రి ఆర్య‌న్లు నివ‌సిస్తున్నారు. నియంత్ర‌ణ రేఖ‌కు స‌మీపంలోనే ఈ గ్రామాలు ఉన్నాయి. 

బ్రోక్పా తెగ వాళ్లే ఆర్య‌న్లా?

హిమాల‌య ప‌ర్వ‌త శ్రేణుల మ‌ధ్య ఉన్న ఈ చిన్న గ్రామాల్లో నివ‌సించే తెగ‌నే బ్రోక్పా అని పిలుస్తారు. ఈ బ్రోక్పా తెగ వాళ్లే స్వ‌చ్ఛ‌మైన ఆర్య‌న్ జాతికి చెందిన వాళ్ల‌ని చెబుతారు. ఇక్క‌డి అబ్బాయిల వ‌ల్ల తాము కూడా గ‌ర్భం దాలిస్తే.. త‌మ‌కూ అంద‌మైన ఆర్య‌న్ సంతానం క‌లుగుతుంద‌న్న‌ది విదేశీ అమ్మాయిల విశ్వాసం. ల‌ఢాక్‌లోని దాహ్‌, హ‌నో, దార్చిక్‌, గార్కోన్ గ్రామాల్లో ఈ బ్రోక్పా తెగ వాసులు నివ‌సిస్తున్నారు. ల‌ఢాక్‌లోని చాలా మంది టిబెటో-మంగోల్ లుక్‌తో క‌నిపిస్తారు. కానీ ఈ బ్రోక్పాల్లో మాత్రం ఇండో-ఆర్య‌న్ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. 


గిల్గిత్ నుంచి వ‌చ్చారా?

బ్రోక్పా తెగ‌కు చెందిన వాళ్లు మొత్తం 1800 మంది ఇక్క‌డ ఉన్నారు. వీళ్లు త‌మ‌కు మాత్ర‌మే సొంత‌మైన జ‌న్యుప‌ర‌మైన ప్ర‌త్యేక‌త‌ను కాపాడుకుంటూ, త‌మ పూర్వీకులను చూసి ఎంతో గ‌ర్విస్తుంటారు. వీళ్లు ప్ర‌స్తుతం పాకిస్థాన్‌లో ఉన్న గిల్గిట్ నుంచి నియంత్ర‌ణ రేఖ మీదుగా ఇక్క‌డికి వ‌చ్చిన‌ట్లు బ్రోక్పా తెగ పెద్ద‌లు చెబుతుంటారు.

టూరిస్టుల‌కు నో ఎంట్రీ!

ఈ గ్రామాల్లోకి చాలా ఏళ్ల వ‌ర‌కూ టూరిస్టుల‌కు అస‌లు ప్ర‌వేశ‌మే ఉండేది కాదు. కానీ 2010 నుంచి స్థానిక ప్ర‌భుత్వం ఈ బ్రోక్పా తెగ నివ‌సిస్తున్న గ్రామాల‌కు టూరిస్టుల‌ను అనుమ‌తించింది. అప్ప‌టి నుంచీ ఇక్క‌డ టూరిజం పుంజుకుంది. దాంతోపాటే ప్రెగ్నెన్సీ టూరిజానికి కూడా డిమాండ్ పెరిగిన‌ట్లు చెబుతారు. అయితే అస‌లు ప్రెగ్నెన్సీ టూరిజం నిజ‌మేనా అని తెలుసుకోవ‌డానికి కొంత‌మంది ఇండిపెండెంట్ జ‌ర్న‌లిస్టులు చాలాసార్లు ప్ర‌య‌త్నించారు. స్వ‌యంగా ఈ గ్రామాల‌కు వెళ్లి, అక్క‌డి పెద్ద‌ల‌ను క‌లిసి మాట్లాడిన సంద‌ర్భాలు కూడా ఉన్నాయి. ఇక్క‌డి అబ్బాయిల‌తో సంతానం కోసం కొంత‌మంది విదేశీ మ‌హిళ‌లు ఇక్క‌డికి రావ‌డం నిజ‌మే కానీ.. బ‌య‌ట అంద‌రూ ఊహిస్తున్న స్థాయిలో ప్రెగ్నెన్సీ టూరిజం మాత్రం లేద‌ని వీరిలో కొంద‌రు చెప్ప‌డం విశేషం. 


ఇవి కూడా చ‌ద‌వండి

హెచ్‌-1బీ వీసా: లాట‌రీ ప‌ద్ధ‌తికి గుడ్‌బై

వుహాన్‌లో ఇన్‌ఫెక్ష‌న్లు మూడు రెట్లు అధికం..

తెలంగాణ‌లో స్కూళ్లు తెరిచేదెప్పుడు?logo