ఆదివారం 05 జూలై 2020
National - Jun 20, 2020 , 07:07:33

దేశీయ ఉత్పత్తుల వాడకానికే ప్రాధాన్యం: రైల్వే బోర్డు

దేశీయ ఉత్పత్తుల వాడకానికే ప్రాధాన్యం: రైల్వే బోర్డు

న్యూఢిల్లీ: ఇకపై రైల్వే అవసరాలకు దేశంలో తయారైన విడిభాగాలను వినియోగించడమే లక్ష్యంగా ముందుకు వెళతామని, దిగుమతులను పూర్తిగా తగ్గించి వేస్తామని రైల్వే బోర్డు చైర్మన్‌ వీకే యాదవ్‌ చెప్పారు. చైనా సంస్థతో భారతీయ రైల్వే సిగ్నలింగ్‌ వ్యవస్థ ఆధునీకరణ ప్రాజెక్టు కాంట్రాక్టును రద్దు చేసుకున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రైల్వేలకు అవసరమైన పరికరాల వాడకం కోసం దేశీయ సంస్థల నుంచి మాత్రమే టెండర్లను ఆహ్వానిస్తున్నామని చెప్పారు. 

సోమవారం సాయంత్రం లఢక్‌లోని గల్వాన్‌ లోయలో భారత బలగాలపై చైనా సైనికులు విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో 20 మంది భారతీయ సైనికులు మరణించారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉధ్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో వీలైనంత వరకు చైనా వస్తువులను దిగుమతి చేసుకోవడం తగ్గించాలని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వరంగ సంస్థలైన బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌లో ఆధునీకరణలో భాగంగా చైనా పరికరాలను ఉపయోగించకూదని టెలికాం మంత్రిత్వశాఖ ఆదేశించింది. అదేవిధంగా రైల్వే శాఖ కూడా చైనాతో చేసుకున్న ఒప్పందాలను రుద్దుచేసుకుంటున్నది. 


logo