అందుబాటులో కోట్లాది వ్యాక్సిన్ డోసులు కానీ..

న్యూఢిల్లీ: ఇండియాకు ఇప్పుడు ఓ కొత్త సమస్య వచ్చింది. ఇన్నాళ్లూ ఎప్పుడెప్పుడు వ్యాక్సిన్ వస్తుందా అని ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉండగా.. ఇప్పుడు ముందుగానే తయారైన వ్యాక్సిన్లను గడువులోపే ఇవ్వడం సాధ్యమవుతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సీరమ్ తయారు చేసిన కొవిషీల్డ్, భారత్ బయోటెక్ తయారు చేసిన కొవాగ్జిన్ టీకాలు ఇప్పటికే కోట్ల సంఖ్యలో ఉత్పత్తి అయ్యాయి. అయితే వ్యాక్సినేషన్ ప్రక్రియ మాత్రం ఆ వేగాన్ని అందుకోలేకపోతోంది. వ్యాక్సిన్ల జీవిత కాలం ఆరు నెలలే కావడంతో వాటిని సాధ్యమైనంత త్వరగా ఇవ్వాలని తయారీ సంస్థలు సూచిస్తున్నాయి.
ముందే తయారీతో చిక్కులు
ఈ వ్యాక్సిన్లలో చాలా వాటిని గతేడాది అక్టోబర్, నవంబర్‌లలోనే తయారు చేశారు. ముఖ్యంగా సీరమ్ ఇన్స్టిట్యూట్కు ముందే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో ఆ సంస్థ కోట్ల కొద్దీ డోసులను సిద్ధం చేసి ఉంచింది. ఇప్పటికే ఈ వ్యాక్సిన్ డోసులు కోల్డ్ స్టోరేజ్‌లలో నెలల పాటు ఉన్నాయి. ఇప్పుడు వీటిని సాధ్యమైనంత తర్వగా వాడాల్సి ఉంది. ఇప్పటికే ఇలాంటి 2 కోట్ల డోసులను ప్రభుత్వానికి పంపిణీ చేశామని, వీటిని వాటి ఎక్స్పైరీ డేట్ ప్రకారం వారాలు లేదా నెలలలోపే వాడాల్సి ఉందని సీరమ్ ఇన్స్టిట్యూట్ ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ సురేశ్ జాదవ్ అంటున్నారు.
చాలా స్లోగా వ్యాక్సినేషన్
వ్యాక్సిన్లు భారీ సంఖ్యలో ఉన్నా.. వాటి వాడకం మాత్రం ఆశించిన వేగంతో ముందుకు సాగడం లేదు. ప్రభుత్వం దగ్గర 2 కోట్ల డోసులు ఉన్నా.. ఇప్పటి వరకు కేవలం 20 లక్షల మందికే వ్యాక్సిన్ ఇచ్చారు. సీరమ్ దగ్గర మరో 5-6 కోట్ల డోసులు సిద్ధంగా ఉన్నాయి. అంతేకాకుండా నెలవారీగా మరో 5-6 కోట్ల డోసులను తయారు చేయాలని సీరమ్ భావిస్తోంది. ఏప్రిల్ నాటికి దీనిని పది కోట్లకు తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నది. అటు భారత్ బయోటెక్ దగ్గర కూడా 2 కోట్ల వరకూ కొవాగ్జిన్ డోసులు ఉన్నాయి. ఆ సంస్థ ఏడాదికి 70 కోట్ల డోసులు తయారు చేయాలని చూస్తోంది. జనవరి 16న ఇండియాలో వ్యాక్సినేషన్ ప్రారంభమైనా.. వ్యాక్సిన్ వేసుకోవడానికి ఇప్పటికీ చాలా మంది వెనుకాడుతున్నారు. అయితే ఇవన్నీ చాలా ఖరీదైన వ్యాక్సిన్లనీ, వీటిని సాధ్యమైనంత త్వరగా ప్రభుత్వం వినియోగించాలని సురేవ్ జాదవ్ చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి
ఎర్రకోటపై దాడి.. రైతులను రెచ్చగొట్టింది ఇతడేనా?
అంతరిక్షం కోసం ప్రపంచ కుబేరుల కొట్లాట
అవును.. ఇండియన్ ప్లేయర్స్‌పై జాత్యహంకార వ్యాఖ్యలు నిజమే
తాజావార్తలు
- మార్చి లేదా ఏప్రిల్‌లో పెట్రోల్ ధరలు తగ్గుతాయి: ధర్మేంద్ర ప్రధాన్
- బ్రెజిల్ ప్రధానికి ప్రధాని మోదీ అభినందనలు
- మల్లయోధుల బృందాన్ని సత్కరించిన పవన్ కళ్యాణ్
- ముంచుకొస్తున్న అంటార్కిటికా ముప్పు.. మంచు కొండలో పగుళ్లు.. వీడియో
- కాస్త స్పిన్ అయితే చాలు ఏడుపు మొదలుపెడతారు!
- సంక్రాంతి బరిలో పవన్ కళ్యాణ్ చిత్రం..!
- పుదుచ్చేరిలో ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది : అమిత్ షా
- జీ-23 నేతల మీటింగ్ రాజ్యసభ సీటు కోసమే : ఎంపీ రంజీత్ రంజన్
- రేపటి నుంచి రెండో విడత వ్యాక్సినేషన్ : శ్రీనివాసరావు
- ఎన్డీయేను గెలిపిస్తే నిరుద్యోగితను తగ్గిస్తాం: అమిత్ షా