మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 13, 2020 , 08:38:22

మధ్యప్రదేశ్‌లోని మహాకాళేశ్వర్ ఆలయంలో ప్రత్యేక పూజలు

మధ్యప్రదేశ్‌లోని మహాకాళేశ్వర్ ఆలయంలో ప్రత్యేక పూజలు

భోపాల్‌ : ‘సావన్’ నెల రెండో సోమవారం నాడు మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి మాట్లాడుతూ కరోనా వైరస్‌ను అంతం చేయమని మహాకల్ దేవుడిని వేడుకున్నామని తెలిపారు. సావన్ నెల సందర్భంగా ఆలయ అర్చకులు కరోనా నిబంధనలు పాటిస్తూ పూజలు నిర్వహించారు. ఈ ఉత్సవాన్ని ప్రధానంగా ఉత్తర భారతదేశంలో ఎక్కువగా జరుపుకుంటారు. హిందూ క్యాలెండర్‌లో ‘సావన్’ ఐదో నెల దీనిని సంవత్సర కాలంలో అత్యంత పవిత్రమైన నెలగా భావిస్తారు. సావన్ నెల శివుడికి చాలా ప్రియమైనది.

ఈ నెలలోని ప్రతి సోమవారం శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సావన్‌ నెలలో వచ్చే సోమవారాల్లో భక్తులు ఉపవాసాలు ఉండి శివాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. సావన్ నెల జూలై 6న ప్రారంభమై ఆగస్టు 3 వరకు ఉటుంది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్లోడ్ చేసుకోండి.


logo