గురువారం 02 ఏప్రిల్ 2020
National - Feb 18, 2020 , 11:08:59

బాత్ బీహార్ కీ.. ప్ర‌శాంత్ కిషోర్ ఉద్య‌మం

బాత్ బీహార్ కీ.. ప్ర‌శాంత్ కిషోర్ ఉద్య‌మం

హైద‌రాబాద్‌:  బీహార్‌లోని జేడీయూ పార్టీ నుంచి వెలివేత‌కు గురైన ఎన్నిక‌ల వ్యూహాక‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ ఇప్పుడు ప్ర‌త్యేక ఉద్య‌మాన్ని న‌డిపించ‌నున్నారు.  పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టం, జాతీయ పౌర ప‌ట్టిక(ఎన్ఆర్సీ)కి వ్య‌తిరేకంగా ఆయ‌న ప్ర‌చారం నిర్వ‌హించ‌నున్నారు.  బాత్ బీహార్ కీ  పేరుతో ఈనెల 20వ తేదీ నుంచి ఆ ప్ర‌చారం సాగ‌నున్న‌ది. బీహార్‌కు కొత్త నేత అవ‌స‌రం అన్న ల‌క్ష్యంతో ఈ ఉద్య‌మం చేప‌ట్ట‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.  రానున్న వంద రోజుల్లో కోటి మంది యువ‌త‌ను త‌మ ఉద్య‌మంలో భాగం చేస్తామ‌న్నారు.  సీఎం నితీశ్ కుమార్‌.. బీజేపీతో క‌లిసి ఉండడాన్ని ప్ర‌శాంత్ తప్పుప‌ట్టారు. పార్టీ ఐడియాల‌జీని బీజేపీకి స‌మ‌ర్పించ‌డాన్ని కిషోర్ అంగీక‌రించ‌లేదు.  నితీశ్‌తో త‌న‌కు మంచి సంబంధాలు ఉన్నాయ‌ని, ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యాన్ని గౌర‌విస్తాన‌ని, కానీ ప్ర‌శ్నంచ‌లేన‌న్నారు. 


logo
>>>>>>