గురువారం 01 అక్టోబర్ 2020
National - Aug 13, 2020 , 11:22:41

త‌ల‌కు తీవ్ర గాయ‌మైనా.. ప్ర‌ణ‌బ్ ప్ర‌శాంతంగానే ఉన్నారు..

త‌ల‌కు తీవ్ర గాయ‌మైనా.. ప్ర‌ణ‌బ్ ప్ర‌శాంతంగానే ఉన్నారు..

హైద‌రాబాద్‌: మాజీ రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉన్న‌ట్లు ఇవాళ ఢిల్లీలోని ఆర్మీ హాస్పిట‌ల్ పేర్కొన్నది. సోమ‌వారం రోజున ప్ర‌ణ‌బ్‌కు బ్రెయిన్ స‌ర్జ‌రీ జ‌రిగింది. అయితే 2007లో జ‌రిగిన కారు ప్ర‌మాదం వ‌ల్లే ప్ర‌ణ‌బ్ త‌ల‌కు గాయాలైన‌ట్లు ఓ బెంగాలీ డాక్ట‌ర్ తెలిపారు.  ప‌శ్చిమ బెంగాల్‌లోని న‌దియా జిల్లాకు చెందిన డాక్ట‌ర్ బాసుదేవ్ మోండ‌ల్ .. ప్ర‌ణ‌బ్‌కు గ‌తంలో ట్రీట్మెంట్ ఇచ్చారు.  2007, ఏప్రిల్ 7వ తేదీన ముర్షీదాబాద్ జిల్లా నుంచి కోల్‌క‌తాకు తిరిగి వస్తున్న స‌మ‌యంలో ప్ర‌ణ‌బ్ కారు మ‌రో వాహ‌నాన్ని ఢీకొట్టింది. అప్పుడు ఆయ‌న త‌ల‌కు గాయాలైన‌ట్లు డాక్ట‌ర్ బాసుదేవ్ తెలిపారు.   

2007లో ప్ర‌ణ‌బ్ విదేశాంగ మంత్రిగా ఉన్నారు. అయితే ప్ర‌మాదం జ‌రిగిన ఆ రోజు రాత్రి తొలుత ప్ర‌ణ‌బ్‌ను స్థానిక హెల్త్ సెంట‌ర్‌కు తీసుకువెళ్లారు. అక్క‌డ ఆయ‌న త‌ల‌కు కుట్టు వేశార‌ని, ఆ త‌ర్వాత ఆయ‌న కృష్ణాన‌గ‌ర్ గ‌వ‌ర్న‌మెంట్ హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. అయితే ఆ హాస్పిట‌ల్‌లో సీటీ స్కాన్, ఎక్స్ రే సౌక‌ర్యాలు లేని కార‌ణంగా.. జిల్లా అధికారులు ప్ర‌ణ‌బ్‌ను త‌న హాస్పిట‌ల్‌కు తీసుకువ‌చ్చిన‌ట్లు గైన‌కాల‌జిస్ట్ బాసుదేవ్ మోండ‌ల్ తెలిపారు.  కొంద‌రు డాక్ట‌ర్ల ఆధ్వ‌ర్యంలో ప్ర‌ణ‌బ్‌ను త‌న న‌ర్సింగ్ హోమ్‌కు తీసుకు వ‌చ్చిన‌ట్లు చెప్పారు. వాస్త‌వానికి ప్ర‌ణ‌బ్‌కు ఆ స‌మ‌యంలో త‌ల‌కు తీవ్ర గాయ‌మైంద‌ని,  నొప్పి అధికంగా ఉన్నా ఆయ‌న మాత్రం చాలా శాంతంగాన, మౌనంగా ఉన్నార‌న్నారు.  చాలా మ‌ర్యాద‌పూర్వంగా వ్య‌వ‌హ‌రించిన‌ట్లు చెప్పారు.  ప‌రీక్ష‌లు జ‌రిపిన త‌ర్వాత ఆయ‌నకు ఇంట‌ర్న‌ల్ ఇంజ్యూరీ జ‌ర‌గ‌లేద‌ని నిర్ధారించిన‌ట్లు డాక్ట‌ర్ బాసుదేవ్ తెలిపారు. ఆ త‌ర్వాత ప్ర‌ణ‌బ్‌ను కోల్‌క‌తాకు తీసుకువెళ్లిన‌ట్లు చెప్పారు. ఈ ఘ‌ట‌న త‌ర్వాత అయిదేళ్ల‌కు ప్ర‌ణ‌బ్‌ రాష్ట్ర‌ప‌తి అయ్యార‌ని, ఓ కార్య‌క్ర‌మానికి ఆయ‌న అతిథిగా వ‌చ్చిన‌ట్లు డాక్ట‌ర్ తెలిపారు. logo