మంగళవారం 22 సెప్టెంబర్ 2020
National - Aug 13, 2020 , 00:45:28

వెంటిలేటర్‌పై ప్రణబ్‌

వెంటిలేటర్‌పై ప్రణబ్‌

న్యూఢిల్లీ, ఆగస్టు 12: మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉన్నట్లు ఆర్మీ రీసెర్చ్‌, రిఫరల్‌ దవాఖాన బుధవారం తెలిపింది. రెండు రోజుల కిందట మెదడుకు శస్త్రచికిత్స చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వైద్య పరీక్షల్లో ప్రణబ్‌కు కరోనా సోకినట్లు వెల్లడైంది. ‘ప్రణబ్‌ గుండె పనితీరు, రక్తప్రసరణ బాగానే ఉన్నా ఆయన ఆరోగ్యం మాత్రం ఇంకా విషమంగానే ఉన్నది’ అని బుధవారం దవాఖాన ఓ ప్రకటన విడుదల చేసింది. 


logo