ఆదివారం 27 సెప్టెంబర్ 2020
National - Aug 12, 2020 , 01:49:09

విషమంగానే ప్రణబ్‌ ఆరోగ్యం

విషమంగానే ప్రణబ్‌ ఆరోగ్యం

న్యూఢిల్లీ, ఆగస్టు 11: మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉన్నది. ఆయనకు మెదడులో ఓ అడ్డంకి ఏర్పడటంతో సోమవారం ఢిల్లీలోని ఆర్మీ రిసెర్చ్‌, రిఫరల్‌ దవాఖానలో శస్త్రచికిత్స చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఆయనకు కరోనా సోకినట్లు వెల్లడైంది. ఈ నేపథ్యంలో ప్రణబ్‌ ఆరోగ్యం క్షీణించడంతో ఆయనను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్యం మంగళవారం కూడా ఇంకా విషమంగానే ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు.

Next Article జళకళ

logo