ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 08, 2020 , 02:10:40

పీపీఈ సూట్లు వేసుకొని చోరీ!

పీపీఈ సూట్లు వేసుకొని చోరీ!

సతారా: కరోనా కాలంలో దొంగలు తెలివి మీరిపోయారు. ప్రపంచమంతా కరోనా భయంతో మాస్కులు, పీపీఈ సూట్ల్లు ధరిస్తుంటే దొంగలు మాత్రం తమను ఎవరూ గుర్తుపట్టకుండా వాటిని ఉపయోగిస్తున్నారు. మహారాష్ట్రలోని సతారా జిల్లాలో దొంగలు రెండు రోజుల క్రితం పీపీఈ సూట్లు ధరించి వచ్చి ఓ బంగారం దుకాణంలో దొంగతనానికి పాల్పడ్డారు. ఆదివారం రాత్రి గోడకు కన్నం పెట్టి షాపులోకి చొరబడ్డారు. షోకేసుల్లో పెట్టిన 78 తులాల బంగారాన్ని దోచుకెళ్లారు. ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. అయితే వారంతా పీపీఈ సూట్లు ధ రించడంతో గుర్తుపట్టడం కష్టంగా మారింది. షాప్‌ ఓనర్‌ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.


logo