ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 25, 2020 , 01:52:40

పవర్‌లిఫ్టర్‌ కరోనా సేవలు

పవర్‌లిఫ్టర్‌ కరోనా సేవలు

  • బెంగళూర్‌ యువకుడి సేవా తత్పరత

బెంగళూరు: మొహమ్మద్‌ అజ్మతుల్లా (అజ్మత్‌) పవర్‌ లిఫ్టర్‌గా పేరుగాంచాడు. 295 కిలోల బరువును సైతం ఎలాంటి అలసట లేకుండా ఎత్తి పలు రికార్డులు సృష్టించాడు. బెంగళూరులోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ప్రోగ్రామ్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న అజ్మత్‌ వారాంతంలో కరోనాతో మరణించిన వాళ్లకు అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నాడు. మనుషుల్లో మానవత్వం ఇంకా బతికే ఉన్నదని రుజువు చేస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. ‘కరోనా సోకి మరణించిన వారికి అంతిమ సంస్కారాలను చేయడానికి బాధితుల కుటుంబంతో సహా ఎవరూ ముందుకు రాకపోవడం నన్ను కలిచి వేసింది. అలాంటి వారికి ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నా. కరోనాతో మరణించిన వారిని శ్మశానానికి తరలించి, అంతిమ సంస్కారాలు చేయడానికి సాయపడుతున్నా. వారాంతాల్లో వీలు ఉన్నప్పుడు ‘మెర్సీ మిషన్‌' అనే స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఈ పనులు చేస్తున్నా’ అని వివరించారు. 


logo