బుధవారం 03 జూన్ 2020
National - May 16, 2020 , 18:07:21

కేంద్రపాలిత ప్రాంతాల్లో విద్యుత్‌ డిస్కంల ప్రైవేటీకరణ

కేంద్రపాలిత ప్రాంతాల్లో విద్యుత్‌ డిస్కంల ప్రైవేటీకరణ

న్యూఢిల్లీ: కేంద్ర పాలిత ప్రాంతాల్లో విద్యుత్‌ డిస్కంలను ప్రైవేటీకరణ చేస్తున్నామని   కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. ప్రైవేటీకరణ ద్వారా విద్యుత్‌ సరఫరాలో నాణ్యత, డిస్కంలలో జవాబుదారీతనం పెరుగుతుందని చెప్పారు. విద్యుత్‌ పంపిణీ రంగంలో నూతన సంస్కరణలు తీసుకొస్తున్నట్లు తెలిపారు. నష్టాల ప్రభావం వినియోగదారులపై పడకుండా చర్యలు తీసుకుంటామన్నారు. విద్యుత్‌ పంపిణీ సంస్థలు మనుగడ సాగించేలా చర్యలు చేపడతామని వివరించారు. కొత్త టారిఫ్‌ విధానంలో వినియోగదారుల హక్కులు, పరిశ్రమల ప్రోత్సాహం, విద్యుత్‌ రంగంలో స్థిరత్వం ప్రధానమైన అంశాలని మంత్రి పేర్కొన్నారు. logo