ఆదివారం 06 డిసెంబర్ 2020
National - Nov 09, 2020 , 14:52:20

కౌంటింగ్‌ కాకముందే తేజస్వి సీఎం అంటూ హోర్డింగులు

కౌంటింగ్‌ కాకముందే తేజస్వి సీఎం అంటూ హోర్డింగులు

పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ జరుగకముందే రాష్ట్రీయ జనతా దళ్‌ (ఆర్జేడీ) నేత తేజస్వి యాదవ్‌ సీఎం అంటూ హోర్డింగులు వెలిశాయి. సోమవారం తేజస్వి పుట్టిన రోజు సందర్భంగా ఆర్జేడీ కార్యకర్తలు ‘బీహార్‌ కాబోయే సీఎం’ అని సంభోదిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. పాట్నాలోని పలు చోట్ల ఈ మేరకు పోస్టర్లు, హోర్డింగులు ఏర్పాటు చేశారు. ఇటీవల ముగిసిన బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తేజస్వి యాదవ్‌ నేతృత్వంలోని మహాకూటమి 128, ఎన్డీయే 99 స్థానాల్లో గెలుస్తాయని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేశాయి. ఈ నేపథ్యంలో పుట్టిన రోజు సందర్భంగా కాబోయే సీఎం తేజస్వి అని పేర్కొంటూ ఆర్జేడీ నేతలు శుభాకాంక్షలు తెలిపారు.

సోమవారం 31వ ఏట ప్రవేశించిన తేజస్వి ఒకవేళ సీఎం అయితే ప్రస్తుతం దేశంలో ఆ పదవిలో ఉన్న పిన్నవయస్కుడుగా నిలుస్తారు. 1967లో ఎంవోహెచ్‌ ఫరూక్ 29 ఏండ్ల వయసులో కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరికి ముఖ్యమంత్రి అయ్యారు. 1968లో సతీష్ ప్రసాద్ సింగ్ 32 ఏండ్ల వయసులో బీహార్ సీఎం పదవి చేపట్టారు. తేజస్వి సీఎం అయితే ఆయన రికార్డును బ్రేక్‌ చేసి బీహార్‌ యువ ముఖ్యమంత్రిగా నిలుస్తారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.