సోమవారం 10 ఆగస్టు 2020
National - Jul 25, 2020 , 10:36:48

మరణించిన మూడురోజుల తర్వాత పాజిటివ్‌ రిపోర్టు

మరణించిన మూడురోజుల తర్వాత  పాజిటివ్‌ రిపోర్టు

ముంబై : మ‌హాన‌గ‌రంలోని కండివాలి ప్రాంతంలో ఒక మ‌హిళ‌ మృతి చెందింది. ఆమె బంధువులు అంత్యక్రియలు నిర్వహించారు. మూడు రోజుల త‌రువాత బీఎంసీ అధికారులు చనిపోయిన మ‌హిళ‌కు క‌రోనా పాజిటివ్ అని తెలిపారు. దీంతో మృతుని బంధువుల‌తో పాటు స్థానికులు ఆందోళ‌న చెందుతున్నారు. జూలై 20న నేహా(28) గుప్తా అనే మహిళ న్యుమోనియా, టీబీతో బాధ‌ప‌డుతూ కూపర్ అనే దవాఖానలో చికిత్స పొందుతూ మృతిచెందింది.

అప్పుడు సాధార‌ణ మృతి అని వైద్యాధికారులు చెప్పడంతో  కుటుంబీకులు నేహా మృత‌దేహానికి అంత్యక్రియలు చేశారు. అయితే ఇది జ‌రిగిన మూడు రోజుల‌ త‌రువాత ఆమెకు క‌రోనాతో మృతి చెందింద‌ని వైద్యులు చెప్పారు. దీంతలో కుటుంబీకులు బీఎంసీ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్లోడ్ చేసుకోండి.


logo