మంగళవారం 04 ఆగస్టు 2020
National - Jul 11, 2020 , 13:08:30

కుటుంబ నియంత్ర‌ణ‌కు మ‌తం అడ్డంకి కావొద్దు: కేంద్ర‌మంత్రి

కుటుంబ నియంత్ర‌ణ‌కు మ‌తం అడ్డంకి కావొద్దు: కేంద్ర‌మంత్రి

న్యూఢిల్లీ: దేశంలో జ‌నాభా రోజురోజుకు వేగంగా పెరుగుతున్న‌ద‌ని, ఇది దేశ అభివృద్ధికి, పురోగ‌తికి స‌వాల్‌గా మారింద‌ని కేంద్ర‌మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. మ‌న దేశం అభివృద్ది చెందిన దేశాల స‌ర‌స‌న నిలువాలంటే.. జ‌నాభా నియంత్ర‌ణ కోసం ఒక ప‌టిష్ట‌మైన చ‌ట్టాన్ని తీసుకురావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. మ‌తాల‌తో సంబంధం లేకుండా అన్ని మ‌తాల‌కు ఒకే నిబంధ‌న‌ వ‌ర్తించేలా ప‌టిష్ట‌మైన చ‌ట్టాన్ని తీసుకురావాల్సిన అస‌వ‌రం ఉన్న‌ద‌ని గిరిరాజ్ పేర్కొన్నారు. అన్ని మ‌తాల వారు కుటుంబ నియంత్ర‌ణ చికిత్సలు చేయించుకునేలా కొత్త చ‌ట్టం ఉండాల‌న్నారు.                    

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo