ఎయిర్పొల్యూషన్తో ఛాతీ, గుండె జబ్బులు

న్యూఢిల్లీ: గతేడాది కాలుష్యం వల్ల భారతదేశంలో 17 లక్షల మంది మృతి చెందాని సైంటిఫిక్ మ్యాగజైన్ లాన్సెట్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇది దేశంలోలోని మొత్తం మరణాల్లో 18 శాతం అని వెల్లడించింది. ఈ మరణాల్లో అత్యధికం వాయు కాలుష్యం అని మంగళవారం తెలిపింది. ఆర్థిక ఆరోగ్య రంగాలపై కాలుష్యం ప్రభావం అనే నివేదికను విడుదల చేసింది. ఇండ్లలో వాయు కాలుష్యం తగ్గుముఖం పట్టడంతో 1990 నుంచి 2019 నాటికి 64 శాతం మరణాలు తగ్గిపోయాయని పేర్కొంది. కానీ ఔట్డోర్ వాయు కాలుష్యం 115 శాతం పెరిగిపోయిందని ఆందోళన వ్యక్తం చేసింది. వాయు కాలుష్యం వల్ల దేశ జీడీపీకి 1.4 శాతం నష్టం వాటిల్లిందని వివరించింది.
వాయు కాలుష్యం వల్ల ఉత్తరాది, మధ్య రాష్ట్రాల జీడీపీపై బాగా ప్రతికూల ప్రభావం చూపిందని లాన్సెట్ తెలిపింది. ప్రత్యేకించి ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా 2.2 శాతం, బీహార్లో 2 శాతం జీడీపీ దెబ్బ తిన్నది. వాయు కాలుష్యం వల్ల జరిగే ప్రాణ నష్టాలు ఆర్థిక రంగంపై ప్రభావం చూపుతాయని నీతి ఆయో సయుడు ప్రొఫెసర్ వినోద్ పాల్ అభిప్రాయ పడ్డారు. కాలుష్యం ప్రభావం కేవలం ఆరోగ్య రంగానికే పరిమితం కాబోదన్నారు. బహుళ రంగాలపై పడుతుందన్నారు. విషపూరిత వాయువుల వల్ల ఆరోగ్యంతోపాటు భారత ఉత్పాదకతను దెబ్బ తీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
40 శాతం వాయు కాలుష్యం వల్ల ఊపిరితిత్తుల సంబంధ వ్యాధులు, 60 శాతం గుండెపోటు, మధుమేహంతో మరణాలు, నవజాత శిశువుల మరణాలు సంభవిస్తున్నాయని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ వెల్లడించారు. దీంతో మానవ ఆరోగ్యంపై వాయు కాలుష్యం విస్తృత ప్రభావం చూపుతుందన్నారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- 27-01-2021 బుధవారం.. మీ రాశి ఫలాలు
- లాజిస్టిక్ పార్క్ రెడీ..
- తెలుగు భాషకు ప్రాణం పోసిన మహనీయుడు ‘గిడుగు’
- ఘనంగా పద్మమోహన-టీవీ అవార్డ్స్...
- బాధితులకు సత్వర న్యాయం అందించడానికి కృషి
- త్యాగధనుల కృషి ఫలితమే గణతంత్రం
- సీసీఎంబీ పరిశోధనలు అభినందనీయం
- కామునిచెరువు సుందరీకరణపై స్టేటస్కో పొడిగింపు
- సీజనల్ వ్యాధులపై వార్
- రాణిగంజ్ ఆర్యూబీ విస్తరణకు చర్యలు