e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, July 29, 2021
Home News ఎంపీతో సెల్ఫీ దిగిన పోలింగ్ ఆఫీస‌ర్‌పై వేటు

ఎంపీతో సెల్ఫీ దిగిన పోలింగ్ ఆఫీస‌ర్‌పై వేటు

ఎంపీతో సెల్ఫీ దిగిన పోలింగ్ ఆఫీస‌ర్‌పై వేటు

జ‌ల్‌పాయిగురి: బెంగాల్‌లో మాజీ సినీ న‌టి, తృణ‌మూల్ ఎంపీ మిమి చ‌క్ర‌వ‌ర్తితో సెల్ఫీ దిగిన పోలింగ్ బూత్ ఆఫీస‌ర్‌పై అధికారులు వేటు వేశారు. ఎంపీతో ఫోటో దిగిన అత‌న్ని విధుల నుంచి రిలీవ్ చేస్తున్న‌ట్లు ఆ నియోజ‌క‌ర్గ అధికారి వెల్ల‌డించారు. జాద‌వ్‌పూర్‌కు చెందిన ఎంపీ మిమి చ‌క్ర‌వ‌ర్తి.. గ‌తంలో పాపుల‌ర్ సినిమా న‌టి. జ‌ల్‌పాయిగురిలో ఓటు వేసేందుకు వెళ్లిన ఆమెతో అక్క‌డ ప‌నిచేస్తున్న బూత్ అధికారి ఫోటో దిగేందుకు ప్ర‌య‌త్నించారు. నిజానికి మొద‌ట ఆ ఆఫీస‌ర్‌ను ఎంపీ నివారించారు. అలా చేస్తే త‌న ఉద్యోగం పోతుంద‌ని, అలాగే నీ ఉద్యోగం కూడా ఊడుతుంద‌ని ఆమె హెచ్చ‌రించారు. అయినా పోలింగ్ ఆఫీస‌ర్ త‌న కోరిక‌ను ఆపుకోలేక‌పోయాడు. ఓటు వేసి బ‌య‌ట‌కు వ‌స్తున్న‌ట్లు ఎంపీతో సెల్ఫీ దిగాడు. ఈ ఘ‌ట‌న ప‌ట్ల జ‌ల్‌పాయిగురి డీఎం మౌమితా గోద్రా మాట్లాడుతూ.. పోలింగ్ ఆఫీస‌ర్ ప్ర‌భుత్వ ఆంక్ష‌ల‌ను ఉల్లంఘించార‌ని, ఈ ఘ‌ట‌న తెలియ‌గానే అత‌న్ని తొల‌గించామ‌ని, అత‌ని స్థానంలో మ‌రో ఆఫీస‌ర్‌ను డిప్యూట్‌ చేసిన‌ట్లు తెలిపారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఎంపీతో సెల్ఫీ దిగిన పోలింగ్ ఆఫీస‌ర్‌పై వేటు
ఎంపీతో సెల్ఫీ దిగిన పోలింగ్ ఆఫీస‌ర్‌పై వేటు
ఎంపీతో సెల్ఫీ దిగిన పోలింగ్ ఆఫీస‌ర్‌పై వేటు

ట్రెండింగ్‌

Advertisement