శనివారం 04 జూలై 2020
National - Jun 19, 2020 , 16:59:39

తబ్లీగీ జమాతే కేసులో 12 ఛార్జిషీట్లు నమోదు

తబ్లీగీ జమాతే కేసులో 12 ఛార్జిషీట్లు నమోదు

ఢిల్లీ : తబ్లీగీ జమాతేపై కేసులో ఢిల్లీ క్రైం బ్రాంచ్‌ పోలీసులు తాజా సాకేత్‌ కోర్టులో 12 ఛార్జిషీట్లు నమోదు చేశారు. కేసులో 41 మంది విదేశీయులను నిందితులుగా పేర్కొన్నారు. దేశ రాజధాని నగరం ఢిల్లీలోని నిజాముద్దీన్‌ ప్రాంతంలో నిర్వహించిన మర్కజ్‌ తబ్లీగీ జమాతే దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తికి కేంద్రంగా మారిన సంగతి తెలిసిందే. నేడు దాఖలు చేసిన ఛార్జిషీట్లలోని 41 మంది విదేశీయులు 12 దేశాలకు చెందినవారుగా పోలీసులు పేర్కొన్నారు.

వీసా రూల్స్‌ అతిక్రమించడం, ప్రభుత్వ నియమాలను ఉల్లంఘించడం, ఎపిడమిక్‌ డీసీజ్‌ యాక్ట్‌, విపత్తు నిర్వహణ చట్టం కింద వీరిపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. కేసులో ఇప్పటివరకు 915 మంది విదేశీయులపై 47 ఛార్జిషీట్లు నమోదు చేసినట్లు తెలిపారు. కోవిడ్‌-19 నేపథ్యంలో ఢిల్లీ కోర్టు ఆదేశాల ప్రకారం వీరంతా వివిధ ప్రాంతాల్లో ఆశ్రయం పొందుతున్నట్లు చెప్పారు. కాగా ఇప్పటివరకు ఈ కేసులో ఎవరిని అరెస్టు చేయలేదని పోలీసులు పేర్కొన్నారు.


logo