సోమవారం 06 జూలై 2020
National - Jun 05, 2020 , 14:43:14

అమెరికా సీన్.. జోధ్‌పూర్‌లో రిపీట్‌

అమెరికా సీన్.. జోధ్‌పూర్‌లో రిపీట్‌

జైపూర్‌: అమెరికాలోని మిన్నెసొటా రాష్ట్రం మిన్నియా పోలీస్‌లో నల్లజాతీయుడైన జార్జ్ ఫ్లాయిడ్‌ను పోలీసులు మెడ‌పై మోకాలితో అదిమిపెట్టి చంపిన ఘ‌టన ఆ దేశవ్యాప్తంగా నిర‌స‌న‌ల‌కు దారితీసింది. దాదాపు గ‌త ప‌దిరోజులుగా జ‌రుగుతున్న నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు, అల్ల‌ర్ల‌తో అగ్ర‌రాజ్యం అట్టుడుకుతున్న‌ది. స‌రిగ్గా అలాంటి ఘ‌ట‌న ఇప్పుడు రాజ‌స్థాన్‌లోని జోధ్‌పూర్‌లో జ‌రిగింది. అయితే అమెరికాలో ఫ్లాయిడ్ అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయాడు. జోధ్‌పూర్‌లో ముకేష్ మాత్రం ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డాడు.

రాజ‌స్థాన్ రాష్ట్రం జోధ్‌పూర్‌లోని బలదేవ్‌నగర్‌కు చెందిన ముకేష్‌కుమార్ ప్రజాపతి అనే వ్యక్తి మాస్కు లేకుండా బయటకు వ‌చ్చాడు. ఇది గమనించిన పోలీసులు అతడిని మంద‌లించి చలాన్ విధించారు. అయితే జరిమానా కట్టేందుకు ముకేశ్ నిరాకరించ‌డంతో పోలీసులకు, అత‌నికి మ‌ధ్య గొడ‌వ జ‌రిగింది. దీంతో పోలీసులు అత‌న్ని నేల‌పై ప‌డేసి మోకాలితో మెడ‌పై అదిమి పెట్టి అదుపులోకి తీసుకున్నారు. ఈ సీన్ అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ హ‌త్యను గుర్తుకు తెచ్చింంది. కాగా, ముకేశ్ గతంలో కూడా స్క్రూ డ్రైవర్‌తో త‌న తండ్రి కంటికి గాయం చేసిన కేసులో అరెస్ట‌య్యాడ‌ని పోలీసులు తెలిపారు. logo