ఆదివారం 24 జనవరి 2021
National - Dec 20, 2020 , 15:03:56

రివాల్వ‌ర్‌తో కాల్చుకుని ఎస్ఐ ఆత్మ‌హ‌త్య‌

రివాల్వ‌ర్‌తో కాల్చుకుని ఎస్ఐ ఆత్మ‌హ‌త్య‌

ప‌ట్నా: ‌బీహార్‌లో ఘోరం జ‌రిగింది. స‌ర్వీస్ రివాల్వ‌ర్‌తో త‌న‌ను తాను కాల్చుకుని ఓ స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్ ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. ఔరంగాబాద్ జిల్లా అంబా పోలిస్‌స్టేష‌న్ స‌మీపంలోని త‌న నివాసంలో ఎస్ఐ ఈ ఘాతుకానికి ఒడిగ‌ట్టాడు. వివ‌రాల్లోకి వెళ్తే.. జితేంద్ర‌సింగ్ (55) అనే వ్య‌క్తి ఔరంగాబాద్ జిల్లాలోని అంబా పోలీస్‌స్టేష‌న్‌లో ఎస్ఐగా విధులు నిర్వ‌హిస్తున్నాడు. అయితే, ఆదివారం ఉద‌యం ఆయ‌న‌ ఉన్న‌ట్టుండి పోలీస్‌స్టేష‌న్ ప‌రిస‌రాల్లోనే ఉన్న త‌న నివాసంలో ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు.

స‌ర్వీస్ రివాల్వ‌ర్‌తో త‌ల‌పై కాల్చుకుని విగ‌తజీవిగా ప‌డిపోయాడు. స‌హ‌చ‌ర పోలీసులు వెంట‌నే ఆస్పత్రికి త‌ర‌లించ‌గా అప్ప‌టికే మృతిచెందిన‌ట్లు వైద్యులు ధృవీకరించారు. దాంతో ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. మృత‌దేహాన్ని పోస్ట్ మార్టం కోసం స‌దార్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. జితేంద్ర‌సింగ్ ఆత్మ‌హ‌త్య‌కు గ‌ల కార‌ణం తెలియాల్సి ఉంద‌న్నారు.

ఇవి కూడా చ‌ద‌వండి..

బాంబు పేలి 9 మంది దుర్మ‌ర‌ణం

విద్యుదాఘాతంతో రైతు మృతి

కోయంబ‌త్తూర్‌లో కేక్ షో.. స్పెష‌ల్ అట్రాక్ష‌న్ క‌రోనా కేక్‌

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo