శుక్రవారం 22 జనవరి 2021
National - Dec 29, 2020 , 15:40:29

స్ల‌మ్ పిల్ల‌ల కోసం ఇంగ్లీష్ క్లాస్‌లు నిర్వ‌హిస్తున్న పోలీస్‌స్టేష‌న్‌

స్ల‌మ్ పిల్ల‌ల కోసం ఇంగ్లీష్ క్లాస్‌లు నిర్వ‌హిస్తున్న పోలీస్‌స్టేష‌న్‌

ముంబై : శాంతిభద్రతల నిర్వహణ విధిని మించి మహారాష్ట్రలోని ఔరంగాబాద్ పోలీసులు మ‌రో అడుగు ముందుకు వేశారు. పోలీస్ స్టేష‌న్ ప‌రిస‌రాల్లోని మురికివాడ ప్రాంతాల పిల్లలకు ఇంగ్లీష్ ట్యుటోరియల్స్ నిర్వహిస్తున్నారు. క‌మ్యూనిటీ పోలిసింగ్ ప్రొగ్రాంలో భాగంగా పుండాలిక్ న‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్ ఈ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టింది. ఓ టీచ‌ర్ స‌హాయంతో 15 రోజులపాటు ఇంగ్లీష్ ట్యుటోరియ‌ల్స్‌ను అందిస్తుంది. ఇప్ప‌టికే ప్రారంభ‌మై 3 రోజులు గ‌డిచిన ఈ ట్యుటోరియ‌ల్స్‌కు 14 మంది పిల్ల‌లు హాజ‌రౌతున్నారు. 

కొవిడ్‌-19 మ‌హ‌మ్మారి నేప‌థ్యంలో విద్యార్థులు పాఠ‌శాల‌ల‌కు హాజ‌ర‌య్యే ప‌రిస్థితులు లేని విష‌యం తెలిసిందే. ఆన్‌లైన్ త‌ర‌గ‌తుల‌కు హాజ‌రు అవుదామంటే సౌక‌ర్యాల లేమితో ఎంతోమంది విద్యార్థులు ఇబ్బందుల‌ను ఎదుర్కొంటున్నారు. ఈ ప‌రిస్థితుల నేప‌థ్యంలో పిల్ల‌ల‌కు ఇంగ్లీష్‌, మాథ్స్ స‌బ్జెక్టుల్లో ట్యుటోరియ‌ల్స్ అందించేందుకు నిర్ణ‌యించిన‌ట్లు అసిస్టెంట్ పోలీస్ ఇన్‌స్పెక్ట‌ర్ ఘ‌న్‌శ్యామ్ సోనావానే తెలిపారు. 

స్థానిక పాఠ‌శాల‌లో ప‌నిచేసి ప‌ద‌వీ విర‌మ‌ణ పొందిన ఎస్ పీ జ‌వాల్క‌ర్ స్వ‌చ్ఛందంగా ఈ ప్రాజెక్టులో భాగ‌స్వామ్యం కావ‌డంతో స్ల‌మ్ పిల్ల‌ల‌కు ఉచితంగా ట్యుటోరియ‌ల్స్‌ను నిర్వ‌హిస్తున్నట్లు చెప్పారు. భౌతిక‌దూరం పాటించ‌డం, మాస్కులు ధ‌రించడం, శానిటైజ‌ర్స్‌ను వినియోగించేలా చూడ‌టంతో పాటు పూర్తిస్థాయి కొవిడ్‌-19 నిబంధ‌న‌ల‌ను పాటిస్తున్న‌ట్లు చెప్పారు. పోలీస్ స్టేష‌న్ భ‌వ‌నం పై భాగంలో ప్ర‌తీరోజు గంట‌న్న‌ర పాటు త‌ర‌గ‌తుల‌ను నిర్వ‌హిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. 

ఇవి కూడా చదవండి

2022 నాటికి లక్షల ఉద్యోగాలు.. ఏయే రంగాల్లో తెలుసా?


logo