గురువారం 09 జూలై 2020
National - May 30, 2020 , 14:16:13

పోలీసుకు కరోనా పాజిటివ్‌.. స్టేషన్‌ మూసివేత

పోలీసుకు కరోనా పాజిటివ్‌.. స్టేషన్‌ మూసివేత

శ్రీనగర్‌ : జమ్మూకశ్మీర్‌లోని కతువా జిల్లాలో కరోనా వైరస్‌ పడగ విప్పింది. ఓ పోలీసుకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో.. అతను విధులు నిర్వర్తిస్తున్న పోలీసు స్టేషన్‌ను మూసివేశారు. ఈ సందర్భంగా కతువా ఎస్పీ శైలేంద్ర మిశ్రా మాట్లాడుతూ.. ఓ పోలీసుకు కరోనా సోకడంతో.. తాత్కాలికంగా స్టేషన్‌ను మూసివేసినట్లు తెలిపారు. మిగతా సిబ్బంది అందరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ప్రస్తుతానికి ఫిర్యాదులు స్వీకరంచమని స్పష్టం చేశారు. స్టేషన్‌ తెరిచే వరకు కతువా మహిళా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదులు చేయొచ్చు అని ఎస్పీ పేర్కొన్నారు. 

జమ్మూకశ్మీర్‌లో ఇప్పటి వరకు 2,164 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. ఈ వైరస్‌ కారణంగా 28 మంది ప్రాణాలు కోల్పోయారు. 875 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు.


logo