బుధవారం 25 నవంబర్ 2020
National - Oct 30, 2020 , 15:05:31

భారీగా న‌కిలీ నోట్లు సీజ్.. ఐదుగురు అరెస్ట్‌‌

భారీగా న‌కిలీ నోట్లు సీజ్.. ఐదుగురు అరెస్ట్‌‌

డెహ్రాడూన్‌: కేంద్రం‌, వివిధ రాష్ట్రాల‌ ప్ర‌భుత్వాలు ఎన్ని క‌ట్టుదిట్ట‌మైన‌ చ‌ర్య‌లు తీసుకుంటున్నా దేశంలో న‌కిలీ నోట్ల ముఠాల ఆగ‌డాలు కొన‌సాగుతూనే ఉన్నాయి. నిత్యం ఎక్క‌డో ఒక‌చోట నిందితులు దొంగ నోట్ల‌ను చెలామ‌ణి చేస్తూ ప‌ట్టుబడుతూనే ఉన్నారు. తాజాగా ఉత్త‌రాఖండ్ రాష్ట్రం ఉధమ్‌సింగ్ న‌గ‌ర్ జిల్లాలో భారీగా దొంగ‌నోట్లు ప‌ట్టుబ‌డ్డాయి. ఉత్త‌రాఖండ్ పోలీసులు నిందితుల నుంచి భారీ సంఖ్య‌లో ఫేక్ ఇండియ‌న్ క‌రెన్సీ నోట్ల (FICN)ను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ఐదుగురు నిందితులు న‌కిలీ నోట్లను చెలామ‌ణి చేస్తుండ‌గా వ‌ల‌ప‌న్ని ప‌ట్టుకున్నారు. వారి నుంచి పెద్ద మొత్తంలో న‌కిలీ క‌రెన్సీని సీజ్ చేసి, వారిని అదుపులోకి తీసుకున్నారు.    

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.