శుక్రవారం 03 జూలై 2020
National - Jul 01, 2020 , 10:09:12

కశ్మీర్‌ ఎన్‌కౌంటర్‌.. బుల్లెట్ల నుంచి బాలుడిని రక్షించిన పోలీసు

కశ్మీర్‌ ఎన్‌కౌంటర్‌.. బుల్లెట్ల నుంచి బాలుడిని రక్షించిన పోలీసు

హృదయవిదారక దృశ్యం.. ఇలాంటి సీన్లు సినిమాల్లో చూసుంటారు.. అప్పటివరకు తన చేయి పట్టుకుని నడిచిన వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలాడు. బుల్లెట్ల వర్షానికి శరీరం తూట్లుపడి నేలకొరిగాడు. ఏం జరుగుతుందో తెలియని మూడేళ్ల పిల్లాడు బిత్తరపోయాడు. తనతోపాటు ఉన్న వ్యక్తి క్షణాల్లో రక్తపుమడుగులో కూలబడటంతో ఆ పసిహృదయం తల్లడిల్లిపోయింది. అచేతనంగా పడి ఉన్న  తాతయ్యపై కూర్చుని లేపే ప్రయత్నం చేశాడు. ఎంతకూ అతను లేవకపోవడంతో ఏడుస్తూ దిక్కుతోచని స్థితిలో బిక్కుబిక్కుమంటూ బిత్తర చూపులు చూస్తున్నాడు.ప్రతి ఒక్కరి గెండెలు బరువెక్కే ఈ దృశ్యం కశ్మీర్‌లోనిది. ఈ హృదయవిదారక దృశ్యం పోలీసులను  సైతం కంట తడి పెట్టించింది. కశ్మీర్‌లోఅసలు ఏం జరిగింది.. పూర్తి వివరాలు..

శ్రీనగర్‌ : జమ్మూకశ్మీర్‌లోని సోపోర్‌ జిల్లాలో బుధవారం ఉదయం పోలీసులు నాకబంది నిర్వహిస్తున్నారు. నాకాబంది అంటే వచ్చిపోయేవాహనాల తనిఖీ. ఇదే సమయంలో ఉగ్రవాదులు  భద్రతా బలగాలపైకి కాల్పులకు తెగబడ్డారు. పోలీసులకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు సీఆర్‌పీఎఫ్‌ జవాన్లతో పాటు ఒక పౌరుడు చనిపోయాడు. పౌరునితోపాటు మూడేళ్ల పిల్లాడు కూడా ఉన్నాడు. ఈ ఎన్‌కౌంటర్‌ నుంచి బాలుడిని ఓ పోలీసు అధికారి కాపాడారు. ఆ బాబుకు బుల్లెట్లు దిగకుండా తన ప్రాణాలను అడ్డుగా పెట్టి.. రక్షించాడు.

తాతయ్య శవంపై కూర్చుని రోదిస్తున్న మూడేళ్ల చిన్నారిని సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లారు. పిల్లాడి ఏడుపును ఆపేందుకు బిస్కెట్లు చాక్లెట్లు కొనిచ్చారు. అమ్మదగ్గరకు తీసుకెళ్తామని ధైర్యం చెప్పారు. ఆ బాలుని పేరు నిహాన్‌గా గుర్తించారు. ఈ ఘటనలో మరో ముగ్గురు సీఆర్పీఎఫ్‌ జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. క‌శ్మీరీల త‌ల‌రాత ఇలా ఉంటుంద‌ని ఓ విద్యార్థిని చేసిన ట్వీట్‌ను..  ఎంపీ అస‌దుద్దీన్ రీట్వీట్ చేశారు. logo