మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 06, 2020 , 18:44:20

వికాస్ దూబే నేపాల్‌కు పారిపోయాడా?

వికాస్ దూబే నేపాల్‌కు పారిపోయాడా?

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌లో 8 మంది పోలీసులను పొట్టనపెట్టుకున్న గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే నేపాల్‌కు పారిపోయాడా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 60కిపైగా క్రిమినల్ కేసులున్న అతడిని పట్టుకునేందుకు 25 పోలీసుల టీమ్‌లను రంగంలోకి దించారు. వికాస్ దూబే ఆచూకీ కోసం పోలీసులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అతడి గురించి సమాచారం ఇచ్చిన వారికి రూ.2.5 లక్షల బహుమతిని కూడా ప్రకటించారు.

మరోవైపు వికాస్ దూబే పోస్టర్లను అన్ని చోట్ల ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా భారత్, నేపాల్ సరిహద్దులోని లక్ష్మీపూర్ జిల్లాలో కూడా అతడి పోస్టర్లు అతికించడంపై స్థానికులు చర్చించుకుంటున్నారు. వికాస్ ఇంట్లో తనిఖీ చేసిన పోలీసులకు భారీగా ఆయుధాలతోపాటు కొన్ని కరపత్రాలు లభించాయి. దీంతో వికాస్ దూబేకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారి సహకారంతో అతడు నేపాల్‌కు పారిపోయి ఉంటాడని అనుమానిస్తున్నారు. దీంతో ఉత్తరప్రదేశ్, నేపాల్ సరిహద్దు ప్రాంతాల్లో వికాస్ దూబే పోస్టర్లను ఏర్పాటు చేయడంతోపాటు అతడి గురించి స్థానికుల నుంచి ఆరా తీస్తున్నారు.
logo