సోమవారం 01 జూన్ 2020
National - May 07, 2020 , 11:32:44

కరోనాతో ఏఎస్‌ఐ మృతి

కరోనాతో ఏఎస్‌ఐ మృతి

ముంబయి : మహారాష్ట్రను కరోనా వైరస్‌ అతలాకుతలం చేస్తోంది. సోలాపూర్‌ జిల్లాలో కరోనాతో పోలీసు అధికారి మృతి చెందారు. మృతి చెందిన పోలీసు ఆఫీసర్‌ ఎంఐడీసీ పోలీసు స్టేషన్‌లో అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తున్నారు. మంగళవారం నిర్వహించిన పరీక్షల్లో ఏఎస్‌ఐకి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో.. ఆయనను ప్రభుత్వ ఆస్పత్రిలోని ఐసోలేషన్‌ వార్డుకు తరలించారు. చికిత్స పొందుతూ గురువారం ఉదయం ఏఎస్‌ఐ కన్నుమూశారు. మహారాష్ట్రలో కరోనాతో ఇప్పటి వరకు ఐదుగురు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలో 16,758 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 651 మంది చనిపోయారు. 


logo