శుక్రవారం 29 మే 2020
National - Jan 21, 2020 , 22:15:46

కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌: పోలీస్‌ అధికారి మృతి

కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌: పోలీస్‌ అధికారి మృతి

జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ప్రత్యేక పోలీస్‌ అధికారి ఒకరు మృత్యువాత పడగా, మరో జవాన్‌ గాయపడ్డారని పోలీసులు తెలిపారు. భద్రతా బలగాలు పుల్వామా జిల్లాలోని ఖ్రీవ్‌ ప్రాంతంలో

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో  ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ప్రత్యేక పోలీస్‌ అధికారి ఒకరు మృత్యువాత పడగా, మరో జవాన్‌ గాయపడ్డారని పోలీసులు తెలిపారు. భద్రతా బలగాలు పుల్వామా జిల్లాలోని ఖ్రీవ్‌ ప్రాంతంలో తనిఖీలు నిర్వహిస్తుండగా ఎన్‌కౌంటర్‌కు దారితీసింది. ఉగ్రవాదుల కాల్పుల్లో ప్రత్యేక పోలీస్‌ అధికారి షాబాజ్‌ అహ్మద్‌ దుర్మరణం చెందగా, ఆర్మీ జవాన్‌ గాయపడ్డారని, కడపటి సమాచారం అందేవరకు ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నట్టు ఓ పోలీస్‌ అధికారి తెలిపారు.  logo