శుక్రవారం 05 జూన్ 2020
National - May 19, 2020 , 17:22:46

బాంద్రా రైల్వేస్టేషన్‌ వద్ద వలసకూలీలపై లాఠీచార్జి.. వీడియో

బాంద్రా రైల్వేస్టేషన్‌ వద్ద వలసకూలీలపై లాఠీచార్జి.. వీడియో

ముంబై: మహారాష్ట్రలోని బాంద్రా రైల్వేస్టేషన్ వద్దకు వలసకూలీలు భారీ సంఖ్యలో చేరుకోవడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. మంగళవారం బాంద్రా నుంచి పూర్ణియాకు ప్రత్యేక శ్రామిక్‌ రైలు బలయదేరి వెళ్లింది. అయితే ఈ రైలులో స్వగ్రామాలకు వెళ్లేందుకు పేర్లు రిజిస్ట్రేషన్‌ చేసుకున్న కూలీలతోపాటు, రిజస్టర్ చేసుకోని వారు కూడా పెద్ద సంఖ్యలో రైల్వే స్టేషన్‌ వద్దకు చేరుకున్నారు. అందరూ రైల్వేస్టేషన్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పేర్లు నమోదు చేసుకోని వారు వెనక్కు వెళ్లాలని హెచ్చరించినా కూలీలు వినకపోవడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. అనంతరం పేర్లు నమోదైన వారిని లోపలికి అనుమతించి రైలులో పంపించారు.


logo