గురువారం 26 నవంబర్ 2020
National - Oct 27, 2020 , 15:37:12

వ‌ల్ల‌భ్‌గ‌ఢ్ నిందితులు అరెస్ట్‌

వ‌ల్ల‌భ్‌గ‌ఢ్ నిందితులు అరెస్ట్‌

న్యూఢిల్లీ: హ‌ర్యానా రాష్ట్రం ఫ‌రీదాబాద్ జిల్లా వ‌ల్ల‌భ్‌గ‌ఢ్ ప‌ట్ట‌ణంలో కారు ఎక్క‌లేద‌న్న కార‌ణంగా యువ‌తిని కాల్చివేసిన కేసులో పోలీసులు ద‌ర్యాప్తును ముమ్మ‌రం చేశారు. ఇప్ప‌టికే ప్ర‌ధాన నిందితుడు తౌసీఫ్‌ను అరెస్ట్ చేసి ఇంటరాగేట్ చేస్తున్న పోలీసులు.. అత‌ను ఇచ్చిన స‌మాచారం అధారంగా అత‌డి స‌హ‌చ‌రుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇదిలావుంటే ఈ ఘ‌ట‌న‌పై హర్యానా ప్ర‌భుత్వం కూడా సీరియ‌స్‌గా ఉన్న‌ది. 

ఈ ఘ‌ట‌నపై హ‌ర్యానా హోంమంత్రి అనిల్ విజ్ మాట్లాడుతూ.. నిందితుల‌ను క‌ఠినంగా శిక్షిస్తామ‌ని చెప్పారు. ఘ‌ట‌న‌కు బాధ్యులైన వారిని పోలీసులు ఇప్ప‌టికే అదుపులోకి తీసుకున్నారని, వారి నుంచి తుపాకీని కూడా స్వాధీనం చేసుకున్నార‌ని అనిల్ విజ్ చెప్పారు. ఘ‌ట‌న‌పై స‌త్వ‌ర ద‌ర్యాప్తు కోసం క్రైం బ్రాంచ్ ఏసీపీ అనిల్ కుమార్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసిన‌ట్లు హోంమంత్రి వెల్ల‌డించారు.     

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.