శనివారం 28 నవంబర్ 2020
National - Nov 15, 2020 , 20:32:14

పోలీస్‌ ఫ్రెండ్లీ క్రికెట్‌ మ్యాచ్‌.. ప్రారంభించిన మంత్రి హరీశ్‌రావు

పోలీస్‌ ఫ్రెండ్లీ క్రికెట్‌ మ్యాచ్‌.. ప్రారంభించిన మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేట : సిద్దిపేట, మెదక్‌ జిల్లాల పోలీసుల అధికారుల మధ్య ఆదివారం ఫ్రెండ్లీ క్రికెట్‌ జిల్లాకేంద్రంలోని మినీ స్టేడియంలో నిర్వహించారు. రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు, పోలీస్‌ కమిషనర్‌ జోయల్‌ డేవిస్‌ హాజరై టాస్‌ వేసి, పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ క్రీడలు మానసికోల్లాసం, శారీరక దృఢత్వానికి దోహదపడుతాయన్నారు. ప్రభుత్వం క్రీడలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తుందన్నారు. సిద్దిపేటలో క్రీడాకారులు రాణించడానికి ఎన్నో అవకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు. సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన గ్రౌండ్‌ ఫుట్‌బాల్‌, వాలీబాల్‌, టెన్నిస్‌, షార్ట్‌పుట్‌, హైజంప్‌, లాంగ్‌ జంప్‌ గ్రౌండ్‌లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.


ఆసక్తి ఉన్న యువతీ యువకులు నిత్యం సాధన చేస్తే ఏదో క్రీడారంగంలో రాణించవచ్చన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండేందుకు వాకింగ్‌, రన్నింగ్‌ చేయాలని, ఇందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఎస్పీ జోయల్‌ డేవిస్‌ మాట్లాడుతూ.. మంత్రి హరీశ్‌రావు ముందు చూపుతో కీడ్రా మైదాలను తీర్చిదిద్దారన్నారు. వివిధ ప్రాంతాల నుంచి కోమటి చెరువు, ఎర్ర చెరువులను అభివృద్ధి చేశారని, ఆయా ప్రదేశాల్లో కుటుంబ సభ్యులతో వచ్చి ఉల్లాసంగా గడపుతున్నారన్నారు. వాకింగ్ ట్రాక్, రోప్ వే, నెక్లెస్ రోడ్, పిల్లలు ఆడుకోవడానికి  ఎన్నో రకాల ఆటవస్తువులను ఏర్పాటు చేయించారన్నారు. కాగా, క్రికెట్‌ మ్యాచ్‌లో సిద్దిపేట జిల్లా జట్టుకు కెప్టెన్‌గా గజ్వేల్‌ సీఐ ఆంజనేయులు, మెదక్‌ జట్టుకు అల్లాదుర్గం సీఐ రవి కెప్టెన్‌గా వ్యవహరించారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.