గురువారం 25 ఫిబ్రవరి 2021
National - Jan 26, 2021 , 11:40:56

ఉద్రిక్తంగా కిసాన్‌ ప‌రేడ్‌.. రైతుల‌పై టియ‌ర్ గ్యాస్ ప్ర‌యోగం

ఉద్రిక్తంగా కిసాన్‌ ప‌రేడ్‌.. రైతుల‌పై టియ‌ర్ గ్యాస్ ప్ర‌యోగం

న్యూఢిల్లీ: గ‌ణ‌తంత్ర దినోత్స‌వం నాడే వ్య‌వ‌సాయ చట్టాల‌కు వ్య‌తిరేకంగా రైతులు చేప‌ట్టిన కిసాన్‌ ప‌రేడ్ ఉద్రిక్తంగా మారింది. మంగ‌ళ‌వారం ఉద‌యాన్నే పోలీసులు పెట్టిన బారికేడ్ల‌ను తొల‌గించి వేలాది మంది రైతులు ఢిల్లీలోకి ప్ర‌వేశించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. వారిపై లాఠీచార్జ్ చేశారు. టియ‌ర్ గ్యాస్ ప్ర‌యోగించారు. నిజానికి రాజ్‌ప‌థ్‌లో గ‌ణతంత్ర వేడుక‌లు ముగిసిన త‌ర్వాత రైతులు త‌మ ట్రాక్ట‌ర్ ప‌రేడ్ చేప‌ట్ట‌డానికి అనుమ‌తి ఇచ్చారు. కానీ రైతులు మాత్రం ఉద‌యం 8 గంట‌ల‌కే స‌రిహ‌ద్దులు దాటి ఢిల్లీలోకి దూసుకువ‌చ్చారు. 

సింఘు, టిక్రీ సరిహ‌ద్దుల్లో తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. వేలాది మంది జెండాల‌ను ప‌ట్టుకొని క‌నిపించారు. కొంద‌రు ట్రాక్ట‌ర్ల‌పై ఢిల్లీలోకి ప్ర‌వేశించారు. క‌నిపించిన పోలీసు వాహ‌నాన్ని ధ్వంసం చేశారు. పాండ‌వ్ న‌గ‌ర్ ద‌గ్గ‌ర్లో ఢిల్లీ, మీర‌ట్ ఎక్స్‌ప్రెస్ వేపై పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్ల‌ను రైతులు తొల‌గించారు. అటు ముక‌ర్బా చౌక్‌లోనూ బారికేడ్ల‌ను తొల‌గించి పోలీసుల వాహ‌నంపై ఎక్కారు. సంజ‌య్‌గాంధీ ట్రాన్స్‌పోర్ట్ న‌గ‌ర్‌లోనూ పోలీసులు, రైతుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం నెల‌కొన్న‌ది. 

VIDEOS

logo