గురువారం 28 మే 2020
National - May 22, 2020 , 10:35:43

పోలీసులకు కోవిడ్ వైద్యసాయం రూ.10వేలకు తగ్గింపు

పోలీసులకు కోవిడ్ వైద్యసాయం రూ.10వేలకు తగ్గింపు

న్యూఢిల్లీ: విధుల్లో ఉన్న పోలీసులు కరోనా బారిన పడితే వైద్య ఖర్చుల కోసం  ఢిల్లీ పోలీస్ శాఖ ఇప్పటివరకు లక్ష రూపాయలు సాయం చేసిన విషం తెలిసిందే. అయితే తాజాగా ఈ మొత్తాన్ని ఢిల్లీ పోలీస్ శాఖ లక్ష నుంచి (90 శాతం తగ్గించి) రూ.10 వేలకు తగ్గించింది. ఇటీవలే ఢిల్లీ పోలీస్ ఉన్నతాధికారులు ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

అయితే కోవిడ్-19 వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయిన పోలీస్ కుటుంబానికి ఎక్స్ గ్రేషియాను రూ.7 లక్షల నుంచి 10 లక్షలకు పెంచింది. ఏ పోలీస్ అధికారి అయినా అస్వస్థతకు లోనైనా..దగ్గు, గొంతు నొప్పి, జ్వరం, శ్వాససంబంధ సమస్యలు వంటి లక్షణాలతో కనిపించినా పోలీస్ స్టేషన్ డ్యూటీ ఆఫీసర్ కు సమాచారమందించాలని పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. ఢిల్లీలో ఇప్పటివరకు మొత్తం 250 మంది పోలీసులకు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయినట్లు సమాచారం. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo