శనివారం 30 మే 2020
National - May 19, 2020 , 17:01:25

యూపీలో కూలీలపై పోలీస్‌ వీరంగం

యూపీలో కూలీలపై పోలీస్‌ వీరంగం

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌ పట్టణంలో ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌ ఇద్దరు కూలీలపై వీరంగం సృష్టించాడు. భవన నిర్మాణ పనుల దగ్గరి నుంచి ఇంటికి తిరిగి వెళ్తున్న ఇద్దరు కూలీలపై హాపూర్‌ కానిస్టేబుల్‌ అశోక్‌ మీనా, హోంగార్డు షరాఫత్‌తో కలిసి తన ప్రతాపం చూపించాడు. లాఠీ దెబ్బలు తాళలేక కూలీలు రోడ్డుపై పడి పొర్లుతున్నా వారిని విడిచిపెట్టలేదు. ఇష్టారీతిన చితకబాదాడు. అయితే ఈ ఘటనను వీడియో తీసిన ఓ వ్యక్తి దాన్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో వైరల్‌ అయ్యింది. ఈ వీడియో చూసిన ఉన్నతాధికారులు కానిస్టేబుల్‌ అశోక్‌ మీనాను విధుల నుంచి సస్పెండ్ చేశారు.  logo