ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 11, 2020 , 16:04:50

తిరువనంతపురంలో కఠినంగా లాక్‌డౌన్‌

తిరువనంతపురంలో కఠినంగా లాక్‌డౌన్‌

తిరువనంతపురం : కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో లాక్‌డౌన్‌ను మరోవారంపాటు పొడిస్తూ.. కంటైన్‌మెంట్‌ జోన్లలో త్రిపుల్‌ లాక్‌డౌన్‌ విధిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయ్‌ విజయన్‌ శుక్రవారం  నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నగరంలో పోలీసులు లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తున్నారు. శనివారం ఉదయం చాలా ప్రాంతాల్లో వాహనదారులను నిలిపి గుర్తింపుకార్డులు పరిశీలించారు. అనవసరంగా రోడ్లపైకి వస్తున్న వారిని వెనక్కు పంపారు. కరోనా విజృంభిస్తున్నందున ఇంట్లోనే ఉండాలని సూచించారు. అత్యవసర పనులకు మాత్రమే బయటకు రావాలని కోరారు. కేరళ రాష్ట్రంలో ఇప్పటి వరకు 6,534 కరోనా కేసులు నమోదుకాగా 27మంది మృతి చెందినట్లు కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమ మంత్రిత్వశాఖ తెలిపింది.


logo