శుక్రవారం 04 డిసెంబర్ 2020
National - Sep 19, 2020 , 09:25:31

అక్ర‌మంగా కొకైన్‌ను త‌ర‌లిస్తున్న న‌లుగురి అరెస్ట్‌..

అక్ర‌మంగా కొకైన్‌ను త‌ర‌లిస్తున్న న‌లుగురి అరెస్ట్‌..

బారాముల్లా: జ‌మ్ముక‌శ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో న‌లుగురు వ్య‌క్తుల నుంచి ఆరు కిలోల కొకైన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్ర‌మంగా కొకైన్‌ను త‌ర‌లిస్తున్నార‌నే స‌మాచారంతో శుక్ర‌వారం నలుగురు వ్య‌క్తుల‌ను అరెస్టు చేశామ‌ని బారాముల్లా ఎస్పీ అబ్దుల్ ఖ‌యూమ్ చెప్పారు. వారి నుంచి 6 కిలోల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నామ‌ని తెలిపారు. దాన్ని ఇత‌ర రాష్ట్రాల్లో అమ్మ‌డానికి తీసుకుళ్తున్నార‌ని వెల్ల‌డించారు. వారిపై కేసు న‌మోదు చేశామ‌ని, ద‌ర్యాప్తు చేప్తుచేస్తున్నామ‌న్నారు.