ఆదివారం 07 జూన్ 2020
National - Apr 04, 2020 , 10:24:37

మార్నింగ్‌ వాక్‌కు వెళ్లిన 41 మంది అరెస్ట్‌..

మార్నింగ్‌ వాక్‌కు వెళ్లిన 41 మంది అరెస్ట్‌..

కొచ్చి : మార్నింగ్‌ వాక్‌కు వెళ్లిన 41 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ ఘటన కేరళ రాష్ట్రంలో చోటుచేసుకుంది. పానంబెల్లి నగర్‌ ప్రాంతంలో పోలీసులు ఈ ఉదయం 41 మందిని అరెస్ట్‌ చేశారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో లాక్‌డౌన్‌ ఆంక్షలను ఉల్లంఘించి వీరంతా సామూహికంగా ఉదయపు నడకకు వెళ్లారు. పోలీసులు డ్రోన్‌ కెమెరాలతో సర్వైలెన్స్‌ చేయగా గుంపులుగా వెళ్తున్నవారు కనిపించారు. సామాజికదూరం పాటించకుండా, లాక్‌డౌన్‌ ఆంక్షలను ఉల్లంఘించిన కారణంగా వీరందరిని అరెస్ట్‌ చేసినట్లు కొచ్చి సౌత్‌టౌన్‌ పోలీసుస్టేషన్‌ ఎస్‌హెచ్‌వో తెలిపారు. తర్వాత వీరంతా బెయిల్‌పై విడుదలయ్యారు. కేరళలో ఇప్పటివరకు 295 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo