సోమవారం 06 జూలై 2020
National - Jun 01, 2020 , 21:57:51

హ‌ర్యానా స‌ర్కారువి రైతు వ్య‌తిరేక విధానాలు: హుడా

హ‌ర్యానా స‌ర్కారువి రైతు వ్య‌తిరేక విధానాలు: హుడా

కురుక్షేత్ర‌: హ‌ర్యానా ప్ర‌భుత్వం రైతు వ్య‌తిరేక విధానాల‌ను అవలంభిస్తున్న‌ద‌ని ఆ రాష్ట్ర మాజీ ముఖ్య‌మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత భూపింద‌ర్ సింగ్ హుడా విమ‌ర్శించారు. సోమవారం కురుక్షేత్ర‌లో మీడియాతో మాట్లాడిన భూపింద‌ర్ సింగ్‌.. దేశంలో క‌రోనా వైర‌స్ కాలుమోపిన‌ప్ప‌టి నుంచి రాష్ట్ర ప్ర‌భుత్వానికి తాము బాధ్యాయుత‌మైన ప్ర‌తిప‌క్షంగా అన్ని విధాలుగా స‌హ‌క‌రించామ‌ని చెప్పారు. కానీ ప్ర‌భ‌త్వం వ‌రుస‌గా రైతు వ్య‌తిరేక విధానాల‌ను అవ‌లంభిస్తుండ‌టంతో ఇప్పుడు విమ‌ర్శిస్తున్నామ‌న్నారు. ప్ర‌తిప‌క్షాలు ఎంత మొత్తుకున్నా విన‌కుండా వ‌రిసాగుపై నిషేధం విధిస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్న‌ద‌ని, ఆ త‌ర్వాత రైతులు ప్ర‌తిప‌క్షాలు ఆందోళ‌న‌కు దిగ‌డంతో వెన‌క్కు త‌గ్గింద‌ని భూపింద‌ర్ సింగ్ విమ‌ర్శించారు.   



logo