సోమవారం 21 సెప్టెంబర్ 2020
National - Aug 11, 2020 , 02:33:31

విషమంగా ప్రణబ్‌ ఆరోగ్యం

విషమంగా ప్రణబ్‌ ఆరోగ్యం

  • మాజీ రాష్ట్రపతికి కరోనా l ఆర్మీ దవాఖానలో బ్రెయిన్‌ సర్జరీ.. 
  • వెంటిలేటర్‌పై చికిత్స l రాష్ట్రపతి కోవింద్‌ ఆరా

న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆరోగ్యం విషమంగా ఉన్నది. మెదడులో ఓ అడ్డంకి ఏర్పడటంతో ఆర్మీ రిసెర్చ్‌ అండ్‌ రిఫరల్‌ దవాఖానలో సోమవారం శస్త్రచికిత్స చేశారు. సర్జరీ విజయవంతమైందని దవాఖాన వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నదని, వెంటిలేటర్‌ అమర్చినట్టు వెల్లడించాయి. ఇదే సమయంలో పరీక్షల్లో ప్రణబ్‌కు కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యిందని పేర్కొన్నాయి. మరోవైపు ప్రణబ్‌ ట్వీట్‌ చేస్తూ తనకు కరోనా సోకిన విషయం నిజమేనన్నారు. వారంరోజులుగా తనను కలిసిన వాళ్లు స్వీయ నిర్భందంలో ఉండాలని, కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ఇంకోవైపు కరోనా మహమ్మారి నుంచి ప్రణబ్‌ ముఖర్జీ కోలుకోవాలని ఇజ్రాయెల్‌ అధ్యక్షుడు ర్యూవెన్‌ రివ్లిన్‌ ఆకాక్షించారు. ప్రణబ్‌ కుమార్తె శర్మిష్టకు ఫోన్‌చేసిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, మాజీ రాష్ట్రపతి ఆరోగ్యం గురించి ఆరా తీశారు.


logo