గురువారం 26 నవంబర్ 2020
National - Nov 02, 2020 , 16:43:30

ఫ్రాన్స్ ఘ‌ట‌న‌ను స‌మ‌ర్థించిన క‌వి మునావ‌ర్‌పై కేసు

ఫ్రాన్స్ ఘ‌ట‌న‌ను స‌మ‌ర్థించిన క‌వి మునావ‌ర్‌పై కేసు

హైద‌రాబాద్‌: ల‌క్నోలో ఉర్దూ క‌వి మునావ‌ర్ రాణాపై ఎఫ్ఐఆర్ న‌మోదు చేశారు.  ఫ్రాన్స్‌లో ఇటీవ‌ల జ‌రిగిన హ‌త్య‌ల‌ను ఆయ‌న స‌మ‌ర్థించారు. ఈ నేప‌థ్యంలో హ‌జ్ర‌త్‌గంజ్ పోలీసు స్టేష‌న్‌లో ఆయ‌నపై కేసు న‌మోదు చేశారు. ఐపీసీలోని 153ఏ, 295ఏ సెక్ష‌న్ల కింద కేసు ఫైల్ చేశారు. మ‌హ‌మ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌ను కించ‌ప‌రుస్తూ ఫ్రాన్స్‌లో కార్టూన్లు వేసిన నేప‌థ్యంలో అక్క‌డ ముస్లింలు ఇటీవ‌ల దాడుల‌కు పాల్ప‌డ్డారు. ఇటీవ‌ల నీస్ న‌గ‌రంలోని ఓ చ‌ర్చిలోకి వెళ్లిన ఓ దుండ‌గుడు క‌త్తితో దాడి చేసి ముగ్గుర్ని హ‌త‌మార్చాడు. ఐపీసీలోని 505 సెక్ష‌న్‌తో పాటు ఐటీ యాక్ట్‌లోని సెక్ష‌న్ 66 ప్ర‌కారం కూడా క‌వి మునావ‌ర్ రాణాపై కేసు బుక్ అయ్యింది. మా నాన్న‌పైనో లేక మా అమ్మ‌పైనో ఎవ‌రైనా చెడు కార్టూన్ వేస్తే, వారిని నేను చంపేస్తానంటూ మునావ‌ర్ ఓ వీడియోలో హెచ్చ‌రించారు. ఫ్రాన్స్ ఘ‌ట‌న‌ను ఉద్దేశిస్తూ మునావ‌ర్ ఈ వ్యాఖ్య‌లు చేసిన‌ట్లు అంగీక‌రించారు.