ఆదివారం 31 మే 2020
National - May 12, 2020 , 16:41:33

రైనోను చంపి..కొమ్మును క‌త్తిరించుకెళ్లారు

రైనోను చంపి..కొమ్మును క‌త్తిరించుకెళ్లారు

అసోం: అసోంలోని క‌జిరంగా నేష‌న‌ల్ పార్కు రైనో (ఖ‌డ్గ‌మృగాలు)ల‌కు ఆవాస‌మ‌నే విషయం తెలిసిందే. వేట‌గాళ్ల‌కు చిక్క‌కుండా రైనోల‌ను కాపాడేందుకు ఫారెస్ట్ గార్డులు ఎప్పటిక‌పుడు పెట్రోలింగ్ నిర్వ‌హిస్తూనే ఉంటారు. అయిన‌ప్ప‌టికీ త‌ర‌చూ రైనోలు వేట‌గాళ్ల ఉచ్చులో ప‌డుతుంటాయి.

తాజాగా క‌జిరంగా పార్కులో ఓ భారీ రైనోను వేట‌గాళ్లు ఏకే 47 గ‌న్ తో కాల్చిచంపారు. ఆ తర్వాత రైనో కొమ్మును కోసుకుని ఎత్తుకెళ్లారు. పార్కులో రైనో విగ‌త‌జీవిగా ప‌డి ఉండ‌గా..దాని కొమ్మును క‌త్తిరించిన‌ట్లు పై ఫొటోలో చూడొచ్చు. ఘ‌ట‌నాస్థ‌లంలో ఖాళీ మందుగండ్లు ప‌డి ఉన్న‌ట్లు గుర్తించారు ఫారెస్ట్ టీం. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo