శనివారం 24 అక్టోబర్ 2020
National - Oct 01, 2020 , 17:15:10

పీఎన్ బీకి రూ.1,200 కోట్ల మోసం చేసిన మరో సంస్థ...

పీఎన్ బీకి రూ.1,200 కోట్ల మోసం చేసిన మరో సంస్థ...

అహ్మదాబాద్ : పంజాబ్ నేషనల్ బ్యాంకుకు(పీఎన్ బీ) గతంలో నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీలు రూ.వేల కోట్లు ఎగ్గొట్టిన సంగతి తెలిసిందే. తాజాగా పీఎన్ బీలో మరో ఫ్రాడ్ లోన్ వెలుగు చూసింది. సింటెక్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(ఎస్ఐఎల్) తీసుకున్న రూ.1,203.26 కోట్ల రుణాలను ఫ్రాడ్‌గా ప్రకటించింది పంజాబ్ నేషనల్ బ్యాంకు. ఈ మేరకు బుధవారం వెల్లడించింది. సింటెక్స్ ఇండస్ట్రీస్ మోసపూరితంగా రూ.1,203 కోట్ల రుణాన్ని పొందిందని బ్యాంకు ప్రకటించింది.సెబి నమోదిత నిబంధనలు, వెల్లడి అంశాలు, బ్యాంకు విధానాల ప్రకారం సింటెక్స్ ఇండస్ట్రీస్ నికర నిర్థక ఆస్తుల్లో రూ.1203 కోట్ల మేర మోసంతో తీసుకున్న రుణాలు ఉన్నాయని ఎక్స్చేంజీలకు ఇచ్చిన సమాచారంలో బ్యాంకు తెలిపింది.

అహ్మదాబాద్ జోనల్ కార్యాలయంలోని కార్పోరేట్ శాఖలో ఈ మోసం జరిగినట్లు తెలిపింది. ఒక ఖాతాను మోసపూరితంగా ప్రకటిస్తే బ్యాంకింగ్ రెగ్యులేటర్ నిబంధనల ప్రకారం బ్యాంకులు 100 శాతం బకాయి రుణాలను ఒకేసారి లేదా 4 త్రైమాసికాల్లో కేటాయించాలి. రూ.1,203 కోట్ల మోసం గురించి ఆర్బీఐకి అకౌంట్స్ ఆఫ్ ది కంపెనీలో వివరించిందని, నిబంధనల ప్రకారం బ్యాంకు ఇప్పటికే రూ.215.21 కోట్లను కేటాయించిందని తెలిపింది. సింటెక్స్ ఇండస్ట్రీస్‌కు రుణాలు ఇచ్చిన ఇతర బ్యాంకుల్లో బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంకు, పంజాబ్ అండ్ సింద్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నాయి. సింటెక్స్ మొత్తం రుణాలు మార్చి 31, 2020 నాటికి రూ.7,157.9 కోట్లుగా ఉన్నాయి. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo