సోమవారం 13 జూలై 2020
National - Jun 26, 2020 , 14:04:41

రాజీవ్ గాంధీ ఫౌండేష‌న్‌కు పీఎం స‌హాయ నిధులు మ‌ళ్లింపు : న‌డ్డా ఆరోప‌ణ‌

రాజీవ్ గాంధీ ఫౌండేష‌న్‌కు పీఎం స‌హాయ నిధులు మ‌ళ్లింపు : న‌డ్డా ఆరోప‌ణ‌

హైద‌రాబాద్‌: ప్ర‌ధాన‌మంత్రి స‌హాయ నిధి నుంచి రాజీవ్ గాంధీ ఫౌండేష‌న్‌కు నిధులు మ‌ళ్లింపు జ‌రిగిన‌ట్లు బీజేపీ అధ్య‌క్షుడు జ‌గ‌త్ ప్ర‌కాశ్ న‌డ్డా ఆరోపించారు.  ఇవాళ ఆయ‌న త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా ఈ విమ‌ర్శ‌లు చేశారు.  యూపీఏ ప్ర‌భుత్వ హ‌యంలో ఈ ఘ‌ట‌న‌లు చోటుచేసుకున్న‌ట్లు వెల్లడించారు. నిస్స‌హాయ స్థితిలో ఉన్న ప్ర‌జ‌లను ఆదుకునేందుకు పీఎంఎన్ఆర్ఎఫ్‌ను ఏర్పాటు చేశార‌ని, కానీ యూపీఏ హ‌యంలో ఆ నిధి నుంచి రాజీవ్ గాంధీ ఫౌండేష‌న్‌కు డ‌బ్బును ట్రాన్స్‌ఫ‌ర్ చేసిన‌ట్లు న‌డ్డా ఆరోపించారు.  ఆ స‌మ‌యంలో ప్ర‌ధాన‌మంత్రి స‌హాయ నిధి బోర్డులో ఎవ‌రున్నారో తెలుసా,  సోనియా గాంధీనే అంటూ న‌డ్డా తెలిపారు.  రాజీవ్ గాంధీ ఫౌండేష‌న్‌కు కూడా సోనియానే చైర్మ‌న్‌గా ఉన్న‌ట్లు బీజేపీ నేత విమ‌ర్శించారు. పార‌ద‌ర్శ‌క‌త గురించి ఆలోచించ‌కుండా అక్ర‌మంగా వ్య‌వ‌హ‌రించిన‌ట్లు న‌డ్డా విమ‌ర్శించారు. ప్ర‌జ‌లు విరాళం ఇచ్చిన డ‌బ్బును ఫౌండేష‌న్‌కు త‌ర‌లించ‌డం మోస‌మ‌ని, కాంగ్రెస్ పార్టీ ప్ర‌జ‌ల‌ను మోసం చేసింద‌న్నారు.  దీని ప‌ట్ల దేశ ప్ర‌జ‌ల‌కు కాంగ్రెస్ పార్టీ క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని న‌డ్డా డిమాండ్ చేశారు. వివాదాస్ప‌ద మ‌త‌ప్ర‌చార‌కుడు జ‌కీర్ నాయ‌క్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ నిధులు సేక‌రించిన‌ట్లు ఆరోపించారు.logo