సోమవారం 06 ఏప్రిల్ 2020
National - Feb 19, 2020 , 17:18:13

మట్టికప్పులో ఛాయ్‌ తాగి, లిట్టి చొక్కా ఆరగించిన మోదీ

మట్టికప్పులో ఛాయ్‌ తాగి, లిట్టి చొక్కా ఆరగించిన మోదీ

న్యూఢిల్లీ: ప్రతీ రోజూ బిజీ షెడ్యూల్‌తో తీరక లేకుండా ఉండే ప్రధాని నరేంద్రమోదీ ఢిల్లీ రాజ్‌పథ్‌లోని ‘హునార్‌ హట్‌' మేళాను ఆకస్మికంగా సందర్శించి..అందరిని ఆశ్చర్యపరిచారు. కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సంప్రదాయ హస్తకళల ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీ హునార్‌ హాట్‌లో 50 నిమిషాలపాటు గడిపి, 120 రూపాయలు చెల్లించి లిట్టి-చొక్కా ఆరగించారు. లిట్టి-చొక్కా బీహార్‌, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌, జార్ఖండ్‌ లో పాపులర్ వంటకం. అనంతరం ప్రధాని మోదీ, మైనార్టీ వ్యవహారాల మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ మట్టి పాత్రల్లో ఆర్డర్‌ చేసిన ఛాయ్‌ను తాగారు. ఆ తర్వాత రెండు కప్పుల ఛాయ్‌కు ప్రధాని 40 రూపాయలు చెల్లించారు. 10 రోజులపాటు కొనసాగనున్న ఈ మేళాకు అన్ని రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన హస్తకళలు, చేతివృత్తుల ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారు. సుమారు 250కిపైగా స్టాల్స్‌ ఏర్పాటు చేశారు. logo