శుక్రవారం 15 జనవరి 2021
National - Dec 17, 2020 , 14:41:15

ఐఫోన్ కంపెనీలో విధ్వంసం.. ప్ర‌ధాని మోదీ తీవ్ర ఆందోళ‌న‌

ఐఫోన్ కంపెనీలో విధ్వంసం..  ప్ర‌ధాని మోదీ తీవ్ర ఆందోళ‌న‌

హైద‌రాబాద్‌: బెంగుళూరు స‌మీపంలోని కోలార్‌లో ఉన్న యాపిల్ ఐఫోన్ స‌ప్ల‌య‌ర్ విస్ట్రాన్ కంపెనీపై కాంట్రాక్టు ఉద్యోగులు దాడి చేసిన విష‌యం తెలిసిందే. ఆ దాడి వ‌ల్ల ఐఫోన్ కంపెనీకి సుమారు 50 కోట్ల న‌ష్టం వాటిల్లింది. అయితే దీనిపై ప్ర‌ధాని మోదీ తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేసిన‌ట్లు క‌ర్నాట‌క సీఎం బీఎస్ య‌డ్యూర‌ప్ప తెలిపారు. కంపెనీ ఆఫీసుపై దాడి చేయ‌డ‌మే కాకుండా.. అక్క‌డ ఉన్న ఐఫోన్లు, ల్యాప్‌టాప్‌లను కార్మికులు లూటీ చేశారు. ఆ నష్టం మొత్తాన్ని 50 కోట్లుగా అంచ‌నా వేశారు. దాడికి దిగిన వారిపై చ‌ర్య తీసుకున్నామ‌ని, విస్ట్రాన్ చాలా ముఖ్య‌మైన విదేశీ కంపెనీ అని, ఇలాంటి ఘ‌ట‌న జ‌ర‌గాల్సింది కాదు అని, ప్ర‌ధాని మోదీ కూడా ఈ ఘ‌ట‌న ప‌ట్ల తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేసిన‌ట్లు ఇవాళ సీఎం య‌డ్డీ తెలిపారు.  ఇలాంటి హింసాత్మ‌క ఘ‌ట‌న మ‌ళ్లీ జ‌ర‌గ‌కూడ‌ద‌ని ఆదేశించామ‌ని, కంపెనీకి పూర్తి మ‌ద్ద‌తు ఇస్తామ‌ని, ఎటువంటి స‌మ‌స్య లేకుండా ఉత్ప‌త్తిని కొన‌సాగించ‌నున్న‌ట్లు సీఎం య‌డ్యూర‌ప్ప చెప్పారు. పెండింగ్‌లో ఉన్న‌ జీతాలు చెల్లించాలంటూ విస్ట్రాన్ కంపెనీ ఉద్యోగులు గ‌త శ‌నివారం బీభ‌త్సం సృష్టించారు.  రాడ్లు, క‌ట్టెల‌తో వ‌చ్చిన కార్మికులు ఆఫీసు ఫ‌ర్నీచ‌ర్‌ను ధ్వంసం చేశారు.