సోమవారం 25 మే 2020
National - Apr 01, 2020 , 15:18:13

క‌రోనా ఎఫెక్ట్‌: రేపు అన్ని రాష్ట్రాల సీఎంల‌తో ప్ర‌ధాని వీడియో కాన్ఫ‌రెన్స్‌

క‌రోనా ఎఫెక్ట్‌: రేపు అన్ని రాష్ట్రాల సీఎంల‌తో ప్ర‌ధాని వీడియో కాన్ఫ‌రెన్స్‌

న్యూఢిల్లీ: ప్రాణాంత‌క క‌రోనా వైర‌స్ దేశంలో రోజురోజుకు మ‌రింత విజృంభిస్తున్న‌ది. కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఎన్ని జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకున్నా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న‌దే త‌ప్ప త‌గ్గ‌డంలేదు. ఇంత‌లో మ‌ర్క‌జ్ నిజాముద్దీన్ ఘ‌ట‌న దేశ‌వ్యాప్తంగా క‌ల‌క‌లం సృష్టించింది. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ గురువారం అన్ని రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు. 

కాగా, వివిధ రాష్ట్రాల్లో న‌మోదైన క‌రోనా కేసులు, సంభ‌వించిన మ‌ర‌ణాలు, క‌రోనా నివార‌ణ‌కు ఆయా రాష్ట్రాలు తీసుకుంటున్న చ‌ర్య‌లు మొద‌లైన వాటిపై ఈ భేటీలో చ‌ర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా మ‌ర్క‌జ్ నిజాముద్దీన్ స‌మావేశంలో పాల్గొన్న వారు ఏయే రాష్ట్రంలో ఎంత‌మంది ఉన్నారు? ఎంత మందికి క‌రోనా పాజిటివ్‌గా తేలింది? వారిపై ప‌ర్య‌వేక్ష‌ణ ఎలా ఉంది? అనే అంశాలు కూడా ఈ భేటీలో చ‌ర్చకు రానున్నాయి. మ‌రోవైపు లాక్‌డౌన్ అమ‌లు తీరుపై కూడా ఈ భేటీలో చ‌ర్చ జ‌రుగ‌నుంది.      


logo