ఆదివారం 25 అక్టోబర్ 2020
National - Sep 02, 2020 , 18:28:22

రేపు యూఎస్‌-ఇండియా స‌ద‌స్సులో ప్ర‌ధాని ప్ర‌సంగం

రేపు యూఎస్‌-ఇండియా స‌ద‌స్సులో ప్ర‌ధాని ప్ర‌సంగం

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ గురువారం యూఎస్-ఇండియా స్ట్రాటజిక్, పార్ట్‌న‌ర్‌‌షిప్ ఫోరం సమావేశంలో  కీలకోపన్యాసం చేయ‌నున్నారు. ప్ర‌తి ఏడాది లాగే ఈ ఏడాది కూడా ఈ లీడర్‌షిప్ సదస్సు జ‌రుగుతున్న‌ది. ప్రధానమంత్రి కార్యాలయం బుధవారం ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది. గురువారం ఉదయం 9 గంటలకు ప్ర‌ధాని మోదీ ప్రసంగం ప్రారంభమవుతుంది. అయితే వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్ర‌ధాని ప్ర‌సంగించనున్నారు. 

యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్ ఫోరం సమావేశాలు ఆగస్టు 31న ప్రారంభమయ్యాయి. ఇవి ఐదు రోజులపాటు జరుగుతాయి. భారత దేశం గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా ఎదిగే అవకాశాలు, భారత దేశంలోని గ్యాస్ మార్కెట్‌లో అవకాశాలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వంటి అంశాలపై ఈ స‌ద‌స్సులో చ‌ర్చ‌ జరుగుతున్న‌ది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo