e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, August 5, 2021
Home News మూడో ముప్పు : ఆరు రాష్ట్రాల సీఎంల‌తో ప్ర‌ధాని మోదీ స‌మావేశం

మూడో ముప్పు : ఆరు రాష్ట్రాల సీఎంల‌తో ప్ర‌ధాని మోదీ స‌మావేశం

మూడో ముప్పు : ఆరు రాష్ట్రాల సీఎంల‌తో ప్ర‌ధాని మోదీ స‌మావేశం

న్యూఢిల్లీ : క‌రోనా కేసులు అధికంగా వెలుగుచూస్తున్న త‌మిళ‌నాడు, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, క‌ర్నాట‌క‌, మ‌హారాష్ట్ర‌, ఒడిషా, కేర‌ళ రాష్ట్రాల సీఎంల‌తో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ శుక్ర‌వారం వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా స‌మావేశ‌మ‌య్యారు. మొత్తం కేసుల్లో 80 శాతం ఈ రాష్ట్రాల నుంచే వెలుగుచూస్తుండ‌టంతో ఆయా రాష్ట్రాల్లో చేప‌ట్టాల్సిన చ‌ర్య‌ల‌పై చ‌ర్చించారు.

థ‌ర్డ్ వేవ్ ముంచుకొస్తుంద‌నే ఆందోళ‌నల నేప‌థ్యంలో ప్ర‌జ‌లు క‌రోనా నిబంధ‌న‌ల‌ను విధిగా పాటించాల‌ని కోరారు. కేసుల సంఖ్య త‌గ్గుతున్న‌ద‌నే అల‌స‌త్వం ప‌నికిరాద‌ని సూచించారు. మ‌నం థ‌ర్డ్ వేవ్ దేశాన్ని తాకుతుంద‌నే అంచ‌నాల న‌డుమ ఉన్నామ‌ని, 80 శాతం కేసులు ఈ రాష్ట్రాల్లోనే న‌మోద‌వుతున్న క్ర‌మంలో సెకండ్‌వేవ్ ఆరంభంలో ఉన్న ప‌రిస్థితి ప్ర‌స్తుతం నెల‌కొంద‌ని పేర్కొన్నారు. థ‌ర్డ్ వేవ్ ముంచెత్త‌నుంద‌నే అంచ‌నాల న‌డుమ కేసుల భారం అధికంగా ఉన్న రాష్ట్రాలు వైర‌స్ వ్యాప్తి క‌ట్ట‌డికి క‌ఠిన చ‌ర్య‌లు చేపట్టాల‌ని కోరారు.

- Advertisement -

ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డం, కాంటాక్టు ట్రేసింగ్‌, చికిత్స, వ్యాక్సినేష‌న్‌ల‌పై దృష్టిసారించాల‌ని అన్నారు. కేంద్రం ఇటీవ‌ల ప్ర‌క‌టించ‌ని కొవిడ్ అత్య‌వ‌స‌ర ప్యాకేజ్ నిధుల‌ను ఉప‌యోగించుకుని రాష్ట్రాలు త‌మ ఆరోగ్య మౌలిక వ‌స‌తుల‌ను మెరుగుపరుచుకోవాల‌ని ప్ర‌ధాని సూచించారు. ఇక శుక్ర‌వారం దేశ‌వ్యాప్తంగా 38,949 కేసులు న‌మోద‌వ‌గా మ‌ర‌ణాలు 100 రోజుల క‌నిష్ట‌స్ధాయిలో 542గా న‌మోద‌య్యాయి.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మూడో ముప్పు : ఆరు రాష్ట్రాల సీఎంల‌తో ప్ర‌ధాని మోదీ స‌మావేశం
మూడో ముప్పు : ఆరు రాష్ట్రాల సీఎంల‌తో ప్ర‌ధాని మోదీ స‌మావేశం
మూడో ముప్పు : ఆరు రాష్ట్రాల సీఎంల‌తో ప్ర‌ధాని మోదీ స‌మావేశం

ట్రెండింగ్‌

Advertisement